జేసీని ఆర్థికంగా గట్టి దెబ్బకొట్టిన జగన్..!

తెలుగుదేశం పార్టీ నేతల్ని ఆర్థికంగా దెబ్బకొట్టే జగన్ వ్యూహంలో మొదటగా… జేసీ దివాకర్ రెడ్డి టార్గెట్ అయ్యారు. ఆయన కుటుంబం ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేయాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించారు. కొద్ది రోజులుగా.. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను… అధికారులు ఎక్కడ కనిపిస్తే అక్కడ సీజ్ చేస్తున్నారు. దానికి రకరకాల కారణాలు వెదుక్కుంటున్నారు. ఓవర్ లోడింగ్ లాంటి సమస్య ఉన్నా… బస్సులు సీజ్ చేసేశారు. దాంతో.. వారికి ఉన్న బస్సుల్లో 70 శాతం ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి న్యాయపోరాటం చేసి.. ట్రిబ్యునల్ కు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నా.. అధికారులు విడిచిపెట్టలేదు. దీనిపై..కొద్ది రోజుల కిందట… తీవ్రమైన విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు.. నేరుగా.. తన వ్యాపారాన్ని మూసేయాలనుకుంటున్నానని ప్రకటించేశారు.

అదే సమయంలో… తమపై జరుగుతున్న ఆర్థిక పరమైన దాడులు.. ఇతర రాజకీయ కక్ష సాధింపు చర్యలపైనా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకార వాంఛ ఎక్కువైందని… ప్రత్యర్థులను హింసించే సమయంలో… అధికారం శాశ్వతం కాదు అని తెలుసుకోవాలని జేసీ సుతిమెత్తగానే హెచ్చరించారు. అధికారులు కావాలని చేయడం లేదని.. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్లే అధికారులు వేధిస్తున్నారన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న టీడీపీ నేతల పై.. వైసీపీ సర్కార్ గురి పెట్టింది. ముందుగా వారిని పార్టీకి దూరం చేసే ప్లాన్.. లేకపోతే.. ఆర్థికంగా దెబ్బకొట్టే ప్లాన్ అమలు చేస్తోందని.. టీడీపీ నేతలంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ వ్యవహారంలో అనేక లొసుగులుంటాయి కాబట్టి… 70 ఏళ్లుగా ఎప్పుడూ ఎదుర్కొనంత సమస్యను జేసీ బ్రదర్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబుపై…వల్లభనేని వంశీ చేసిన విమర్శలను..జేసీ దివాకర్ రెడ్డి లైట్ తీసుకున్నారు. పార్టీని వీడాలనుకుంటున్నప్పుడు.. అధినేతను ఏదో ఒకటి అనాలి కదా అని తేల్చేశారు. చంద్రబాబుపై సుజనాచౌదరి కూడా విమర్శలు చేశారని… గుర్తు చేశారు. అయితే.. వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని హితవు పలికారు. తాను జైలుకైనా వెళ్తాను కానీ .. లొంగిపోనని.. జేసీ కొద్ది రోజుల కిందట ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close