క‌న్నీళ్లు పెట్టుకుంటూనే జేసీ మాస్ వార్నింగ్…

ఈరోజు నుండి 10 రోజులు. నేను, నా భార్య‌… నా పిల్ల‌లు వ‌చ్చి కూర్చుంటాం. ఎంక్వైరీ జ‌ర‌గాల్సిందే… న‌న్ను, నా కుటుంబ స‌భ్యుల‌ను దొంగ‌ల్లాగ చూపించి అవ‌మానించిన పేర్ని నాని, అధికారులు సీతారామాంజ‌నేయులు, ప్ర‌సాద‌రావు, డీటీసీ, వ‌ర్క్ ఇన్స్పెక్ట‌ర్ల‌ను ఎవ‌రినీ వ‌ద‌ల‌ను అంటూ తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

మ‌మ్మ‌ల్ని వేధించార‌ని, గ‌త 5 సంవ‌త్స‌రాల పాల‌న‌లో రవాణా శాఖ అధికారులు మా ట్రావెల్స్ ను ఇబ్బందిపెట్టార‌ని… అరెస్ట్ చేసి జైలుకు పంపార‌న్నారు. మీకు భార్య బిడ్డ‌లు లేరా… అంటూ ఆవేద‌న‌తో క‌న్నీళ్లు పెట్టారు.

నేను సీఎం చంద్ర‌బాబును ఏమీ అన‌టం లేద‌ని… గౌర‌విస్తాన‌ని కానీ వాళ్ల‌ను మాత్రం వ‌ద‌ల‌న‌న్నారు. నాతో పార్టీకి చెడ్డ పేరు వ‌స్తుంద‌నుకుంటే పార్టీకి రాజీనామా అయినా చేస్తా కానీ వారిని మాత్రం వ‌ద‌ల‌ను అంటూ క‌న్నీరు పెట్టుకుంటూ వార్నింగ్ ఇచ్చారు. మీకు పిల్ల‌లు లేరా… మా పిల్ల‌ల‌ను ఎంత హింసించారో ఎలా మ‌ర్చిపోతాను అంటూ మండిపడ్డారు.

నా కొడ‌క‌ల్లారా… అరేయ్ శివ‌ప్ర‌సాద్… మీరు ప్ర‌భుత్వ ఉద్యోగులు కారా… నేను నా భార్య పిల్ల‌లు బ‌య‌ట తిర‌గ‌లేక‌పోతున్నాము. మీ వ‌ల్లే… న‌రుకుతా అని హెచ్చ‌రించారు. నేను త‌ప్పు మాట్లాడుతుండొచ్చు కానీ డీటీసీ కి ఫ్యామిలీ లేదా అని మండిప‌డ్డారు. బ్రేక్ ఇన్స్పెక్ట‌ర్లు నా బ‌స్సుల‌ను రిపేర్లు చేసి పెట్టాల్సిందేన‌న్నారు. పేర్ని నాని స‌హా ఆనాడు ఇబ్బందిపెట్టిన అధికారుల‌పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుక‌ప‌డ్డారు.

స‌జ్జ‌ల గాడు, పేర్ని నాని గాడు చెప్తే చేస్తారా… అరేయ్ పేర్నినానిగా తూ అంటూ మండిప‌డ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

సీఐడీ మాజీ డీజీపై క్రమశిక్షణా చర్యలు ?

విధి నిర్వహణలో తప్పుడు పనులు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రఘురామ చేసిన...

జనసైనికుడు అవ్వాలనుకుంటున్నారా ?

జనసేన పార్టీ ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి ఘన విజయాల్ని సాధించింది. ఇప్పుడు సంస్థాగతంగా బలపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 18...

HOT NEWS

css.php
[X] Close
[X] Close