ప్రత్యేకహోదా పేరుతో షర్మిల, జేడీ హడావుడి !

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడో మాట్లాడటం మానేశాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేసేందుకు ఆసక్తిగా లేవు. కానీ షర్మిలతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మినారాయణ హోదా అంశాన్ని గట్టిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ రాజకీయాలకు ముడి పెడుతున్నారు.

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలి‌.. బడ్జెట్‌ను స్తంభింపజేస్తే కేంద్రం ఆలోచిస్తుందని జేడీ లక్ష్మినారాయణ సలాహా ఇచ్చారు. 14వ పైనాన్స్ కమిషన్ ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇవ్వొచ్చని కమిషన్‌ చెప్పిందని ఆయనంటున్నారు. జేడీ లక్ష్మినారాయణ ఉద్యమానికి చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు సహకరిస్తున్నారు. అదే సమయంలో షర్మిల ప్రత్యేకహోదా అస్త్రంలో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

రెండో తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ప్రత్యేకహోదాపై ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఢిల్లీకి రావాలని ఆదేశించారు కొంత మంది ఏఐసీసీ నేతలు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ ఆదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు.

ప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేయడానికి షర్మిల, లక్ష్మినారాయణ ప్రయత్నిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే ఎన్నికల అంశం అయింది. హామీైలు ఇచ్చిన రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. కానీ హోదా మాత్రం రాలేదు. దీంతో ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close