ప్రభుత్వంపై నకిలీ మద్యం పేరుతో పెద్ద కుట్ర చేసిన జోగి రమేష్ దొరికిపోయే సరికి కిందామీదా పడుతున్నారు. సిట్ వచ్చే దాకా ఆగలేకపోతున్నారు. టీవీ9లో కూర్చుని సవాళ్లు విసురుతున్నారు. టీవీ9ని జడ్జిగా పెట్టుకుని అన్నీ చర్చిద్దామంటున్నారు. లై డిటెక్టర్ టెస్టుకు వస్తా అంటున్నారు. తిరుపతి గుళ్లో..విజయవాడ గుళ్లో ప్రమాణాలు చేద్దామంటున్నారు. ఆయన తీరు చూసి వైసీపీ నేతుల కూడా.. జోగి రమేష్ దొరికిపోయాడని అందుకే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడని నిర్ణయానికి వస్తున్నారు.
ఇటీవల నకిలీ మద్యంపై సిట్ ను నియమించారు. కేసును హ్యాండోవర్ చేసుకుని సిట్ అధికారులు తమ కార్యచరణ ప్రారంభిస్తారు. జనార్దన్ రావును కస్టడీకి తీసుకుని అసలు విచారణ ప్రారంభిస్తారు. అప్పుడు జోగి రమేష్ ను నిజంగానే తీసుకెళ్తారు.ఆయన రాను అన్నా వదిలి పెట్టరు. ఆయన ఇవ్వరు అన్నా సరే ..ఉపయోగించిన ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఇంటి సీసీ ఫుటేజీని కూడా తీసుకుంటారు. జనార్దన్ రావుతో ఉన్న లావాదేవీలన్నీ బయటపెడతారు.
గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకున్నారేమో కానీ .. నేరుగా ప్రభుత్వంపైనే కుట్రలు చేస్తే ఊరుకునే అవకాశం లేదు. జోగి రమేష్ చేసిన కుట్రలకు కఠినమైన శిక్ష అనుభవించడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులోనూ.. ఇతర కేసుల్లోనూ చట్ట ప్రకారమే వెళ్లి ఆయనకు అన్ని న్యాయపరమైన అవకాశాలు కల్పించారు. కానీ ఈ సారి మాత్రం ఆయన బయటపడటం కష్టమన్న అభిప్రాయం ఉంది. అందుకే తర్వాత అరిచే అవకాశం వస్తుందో రాదోనని ఇప్పుడే అరిచేస్తున్నారు.