నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారిగా భావిస్తున్న జోగి రమేష్.. తేలు కుట్టిన దొంగ తరహాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని బుకాయించినప్పటి నుండి వరుసగా ఆయనతో సంబంధాలు బయటకు వస్తున్నాయి. ముఖం కూడా తెలియదని చెప్పిన ఆయన.. క్లోజ్ గా దిగిన ఫోటోలు బయటకు వచ్చాక కూడా అదే డ్రామా కొనసాగిస్తున్నారు.
దుర్గ గుడికి వెళ్లి నకిలీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఏ సంబంధం లేదని ప్రమాణం చేశారు. చంద్రబాబు,లోకేష్ కు సవాల్ విసిరానని వాళ్లు రాలేదని.. తాను వచ్చి ప్రమాణం చేశానని చెప్పుకున్నారు. తన తప్పు ఉందని నిరూపిస్తే.. దుర్గమ్మ కాళ్ల దగ్గర ఉరేసుకుంటానని బీరాలు పలికారు. కానీ అద్దేపల్లి జనార్దన్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొత్తం గుట్టుబయట పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందుకే జోగి రమేష్ ఈ హడావుడి చేస్తున్నారని అందిరకీ అర్థమైపోతుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం వ్యాపారం చేశానని అద్దేపల్లి సోదరులు చెబుతున్నారు. అప్పటి లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. ఎంత హడావుడి చేసినా.. జోగి రమేష్ బయటపడటం కష్టమని చెబుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ప్రమాణాల పేరుతో ఆయన చేస్తున్న డ్రామాలు చేసి.. నిజంగా జోగి రమేషే చేశాడని… ఎక్కువ మంది నమ్ముతున్నారు.
