నకిలీమద్యం వ్యవహారంలో అసలు స్కెచ్ జోగి రమేష్దని .. ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని .. ఆ సమయంలో ఏమీ కాదని.. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు.
తంబళ్ల పల్లెలో మద్యం దుకాణాలను లాటరీలో పొందానని.. ఇటీవల మళ్లీ జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించాలని సూచించారని పోలీసులకు చెప్పారు. ఒక వేళ దొరికతే.. ప్రభుత్వంపై బురత చల్లవచ్చని.. తంబళ్లపల్లె నుంచే ప్రారంభించాలని సూచించారన్నారు. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. అద్దెపల్లి నర్సింగరావు స్టేట్ మెంట్ సంచలనం సృష్టిస్తోంది.
ఇందులో ఎంత నిజం ఉందో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చనుంది. జోగి రమేష్ ఇలాంటి కుట్రలు చేయడంలో రాటుదేలిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని అందరికీ స్పష్టత ఉంది. ఇప్పుడు ఆయన నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారిగా బయటకు రావడం సంచలనంగా మారనుంది. జోగి రమేష్ ఈ సారి తప్పించుకోలేడన్న అభిప్రాయం వినిపిస్తోంది.