అప్ డేట్: జూన్‌లో ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా

ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో `జ‌న‌తా గ్యారేజ్‌` వ‌చ్చింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబో చూడ‌బోతున్నాం. ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్తుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌. ఇదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చిత్ర‌బృందం తెలిపింది. అంతే కాదు.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స‌య్యింది. ఏప్రిల్ 29, 2022లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

మ‌రి బ‌న్నీ సినిమా మాటేంటి?

ప్ర‌స్తుతం `ఆచార్య‌` షూటింగ్ లో బిజీగా ఉన్నారు కొర‌టాల‌. ఈ సినిమా త‌ర‌వాత‌.. అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్టు సెట్ అయ్యింది. `ఆచార్య‌` త‌ర‌వాత‌.. అదే ప‌ట్టాలెక్కాలి. అయితే స‌డ‌న్ గా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. బ‌న్నీ తో సినిమా చేయాల్సిన నిర్మాత‌లే.. ఎన్టీఆర్ సినిమాకీ సార‌ధ్యం వ‌హిస్తున్నారు. అంటే బ‌న్నీ సినిమా స్థానంలోనే ఎన్టీఆర్ సినిమా ఓకే అయ్యింద‌న్న‌మాట‌. మ‌రి… బ‌న్నీతో సినిమా ఉంటుందా? ఉండ‌దా? అనేది తేలాల్సిన ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close