జూపల్లి, తుమ్మల… తెరాసని ఓడించి సత్తా చాటుతారట?

సొంత పార్టీని గెలిపించడం ద్వారా సత్తా చాటుకునే నాయకులు ఉంటారుగానీ, ఓడించడం ద్వారా పట్టు పెంచుకోవాలని ప్రయత్నించేవారు ఎవరైనా ఉంటారా..? ఏమో, తెరాసలో అలాంటివాళ్లు ఉన్నారనే అనిపిస్తోంది. తమకు గుర్తింపు లేదంటూ అసంత్రుప్తితో ఉన్న కొంతమంది కీలక తెరాస నేతలు ఇదే అదును అన్నట్టుగా పట్టు బిగిస్తున్నారు. ఓరకంగా సొంత పార్టీలో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. వారేం చేశారూ అంటే… మున్సిపల్ ఎన్నికల్లో తెరాస తరఫున దాదాపు అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో రెబెల్స్ బరిలోకి దిగారు కదా. ఆ రెబెల్స్ వెనక ఉండి, వారిని ముందుకు నడిపిస్తున్నది ఈ కేటగిరీ నేతలే అనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి తెరాస తరఫున పోటీ చేసి, బీరం హర్షవర్థన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత, బీరం తెరాసలోకి వచ్చేశారు. ఇంకేముంది, ఆధిపత్య పోరు షురూ. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తన వర్గానికి సీట్లు దక్కకుండా బీరం అడ్డుపడ్డారన్నది జూపల్లి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే, అక్కడున్న 20 వార్డుల్లోనూ రెబెల్స్ ని జూపల్లి రంగంలోకి దించారని తెరాస వర్గాలు అంటున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్లన్నీ జూపల్లే వేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీరం వర్గాన్ని ఓడించితే… మరోసారి పార్టీలో తన ఆధిపత్యం పెరుగుతుందన్నది జూపల్లి వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, రెబెల్స్ వెనక జూపల్లి ఉన్నారనే అంశం పార్టీ వర్కింగ్ కేటీఆర్ వరకూ వెళ్లడం, ఆయనే స్వయంగా చర్చించడమూ, ఛ ఛా అలాంటిదేం లేదని జూపల్లి చెప్పడమూ జరిగిపోయింది.

పాలేరు నియోజక వర్గ పరిధిలో కూడా ఇలాంటి పంచాయితీ నడుస్తోంది. అక్కడ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, ఫిరాయింపు ఎమ్మెల్యే ఉపేందర్ కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. వలస ఎమ్మెల్యే రావడంతో తన వర్గానికి ప్రాధాన్యత తగ్గిపోయిందని తుమ్మల అసంత్రుప్తితో ఉన్నారు. దీంతో ఇప్పుడు సొంత నియోజక వర్గంలో, సొంత పార్టీకి వ్యతిరేకంగా రెబెల్స్ ని బరిలోకి ఆయనే దించరానే ఫిర్యాదులు కేటీఆర్ కి అందాయి. ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థుల్ని ఓడించడం ద్వారా పార్టీలో తన ప్రాధాన్యత మరోసారి పెంచుకోవాలన్నది తుమ్మల వ్యూహంగానూ వినిపిస్తోంది. సొంత పార్టీలో పట్టు సాధించడం కోసం… సొంత పార్టీ అభ్యర్థుల్ని ఓడించాలని… సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నట్టు కథనాలు రావడం వింతగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close