కేఏ పాల్ నామినేషన్ అంగీకరిస్తారా..? అంతా ఉత్తదేనా..?

ప్రజాశాంతి పార్టీ పెట్టి గత ఎన్నికల్లో అభ్యర్థుల సీడీ పోయిందని పోటీ చేయలేకపోయిన.. కేఏ పాల్.. ఈ సారి మాత్రం అన్నీ పేపర్ మీద రాసుకున్నారు. అభ్యర్థుల పేర్లన్నింటినీ పేపర్ మీద రాసుకుని.. వచ్చిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చేశారు. అయినప్పటికీ.. కొన్ని మిగిలిపోయాయి. వాటి సంగతేమోకానీ… కనీసం… ఆయన పార్టీ తరపున… వేసే ఒక్క నామినేషన్ అయినా చెల్లుతుందా.. అనే సందేహం బయలుదేరింది. చివరికి కేఏ పాల్ నామినేషన్ కూడా.. చెల్లే పరిస్థితులు కనిపించడం లేదు. నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన ఆయన… తన పేరు… తండ్రి పేరు… నియోజకవర్గం పేరు .. ఆడ్రస్ రాసి… ఇచ్చేశారు. ఇంకే వివరాలు.. నామినేషన్ పత్రాల్లో లేవు. మొత్తంగా ఖాళీగా ఉంచేశారు. అదే సాధ్యం పాల్ గారూ.. మొత్తం డీటైల్స్ .. ఇరవై ఐదో తేదీ లోపు తీసుకు రండి అని రిటర్నింగ్ అధికారి గౌరవంగానే చెప్పి పంపించారు.

కానీ.. కేఏ పాల్‌కు అలాంటి పట్టింపులేమీ లేనట్లు ఉన్నాయి. ఆయన అసలు భారతీయుడేనా కాదా అన్న సందేహాలున్నాయి. ఆయన సుదీర్ఘ కాలం విదేశాల్లో ఉన్నారు. ఆయనకు.. అమెరికన్ గ్రీన్ కార్డు ఉంటే.. పోటీకి అనర్హుడు. అంతే కాదు… ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం… ఆస్తులు, కేసులు సహా మొత్తం చెప్పాల్సి ఉంటుంది. కేఏ పాల్ ఈ వివరాలను… చెబుతారా..? అన్నది అసలైన సందేహం. నిజంగా సీరియస్‌గా నామినేషన్ వేయాలని అనుకుంటే.. ముందుగానే.. అంతా రెడీ చేసి.. నామినేషన్ వేసేవారని.. కానీ.. ఆయన సీరియస్‌గా అలా కామెడీ చేస్తున్నారని.. చివరికి పోటీలో ఉండరని అంటున్నారు.

ఈ ఒక్క రోజు… నామినేషన్ ఆమోదం పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలు ఇవ్వకపోతే.. పరిశీలనలో ఎగిరిపోతుంది. అప్పుడు.. కేఏ పాల్.. తాను ప్రధానమంత్రి అవుతానన్న ఉద్దేశంతో.. కుట్రపన్ని ఇలా చేశారని.. టీవీల ముందు కాస్తంత స్కిట్లు వేయగలరు కానీ… పోటీ మాత్రం చేయలేరు. ఇన్ని రోజులు.. ఆయన పార్టీ పేరుతో హడావుడి చేసి.. ఎన్నికల గుర్తు కోసం టెన్షన్ పడి.. వైసీపీతో తిట్లు తిని.. ఆయన ఏం సాధించినట్లు అవుతుంది. పాల్ నామినేషన్ ఆమోదిస్తే.. రాజకీయాలకు కాస్త కామెడీనెస్ అయినా వస్తుంది. లేకపోతే.. సీరియస్ అయిపోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close