కడప మేయర్ ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈసీ నోటిఫికేషన్‌పై కోర్టుకు వెళ్లిన మాజీ మేయర్ సురేష్‌బాబు పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ దశలో మేయర్ ఎన్నికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గురువారం యథావిధిగా కడప కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. అవినీతికి పాల్పడటంతో సురేష్ బాబు మేయర్ పదవి కోల్పోయారు.
అయితే మేయర్ ఎన్నికకు టీడీపీ పోటీ చేయడం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి బలం లేదు. కడప కార్పొరేషన్లో 50 స్థానాలు ఉంటే..ఒక్కరే టీడీపీ కార్పొరేటర్. ఆమె కూడా రెబల్ గా ఉన్నారు. మరొకరు ఇండిపెండెంట్. 48 స్థానాల్లో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు కార్పొరేటర్లు చనిపోగా.. ఏడుగురు టీడీపీలో చేరారు. ఎలా చూసినా ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్ల బలం 40 దాకా ఉంది.
కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. మేయర్ గా ఎవరిని ఎన్నుకోవాలో వైసీపీలో క్లారిటీ లేదు. వారిలో వారికే పోటీ ఉంది. అందుకే అధికారిక అభ్యర్థిని తన వర్గంతో నిలబడేవారిని బలపర్చి గెలిపించి..వైసీపీ పరువు తీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటిప్పుడు వైసీపీ మేయర్ తరపున పోటీ చేసేవారు.. కార్పొరేటర్ల కోరికలను తీర్చి ఓటు వేయించుకోవాలని అనుకోవడం లేదు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం..వచ్చే ఏడాది మార్చి 18న ముగుస్తుంది. ఎందుకు ఖర్చు అనుకుంటున్నారు.