కోలుకున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.. జ‌గ‌న్‌కి లేఖ‌

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ తీవ్ర అనారోగ్యంతో ఇటీవ‌ల ఆసుప‌త్రి పాలైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న దాదాపు మ‌ర‌ణ‌పు అంచుల వ‌ర‌కూ వెళ్లారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగొచ్చారు. తాను క్షేమంగా ఉన్నాన‌ని, త‌న ఆరోగ్యం పూర్తిగా మెరుగుప‌డింద‌ని కైకాల స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. త‌న ఆసుప‌త్రి ఖ‌ర్చుల్ని భ‌రించిన ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కైకాల ఆసుప‌త్రిలో చేరిన త‌రువాత‌…ఆయ‌న ఆసుప‌త్రి ఖ‌ర్చుల్ని భ‌రించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. దాదాపు 25 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఆసుప‌త్రి బిల్లుని ప్ర‌భుత్వ‌మే భ‌రించిన‌ట్టు స‌మాచారం. అందుకే.. కైకాల జ‌గ‌న్ కి ప్ర‌త్యేకంగా ఓ లేఖ రాసి, త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కైకాల అనారోగ్యం పాలై ఆసుప‌త్రి పాల‌వ్వ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. కొన్ని టీవీ, యూట్యూబ్ ఛాన‌ళ్ల‌యితే.. కైకాల చ‌నిపోయారంటూ వార్త‌ల్ని ప్ర‌సారం చేశాయి. ఆ త‌ర‌వాత త‌మ తొంద‌ర పాటుకు నాలిక క‌రుచుకున్నారు. ఇప్పుడు కైకాల సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావ‌డం అభిమానుల‌కు గొప్ప ఊర‌ట క‌లిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్యాడర్ పార్టీ టీడీపీ మరో సారి ఫ్రూవ్ !

దారుణ పరాజయం.. ఆ తర్వాత వేధింపులు.. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టుడు.. చివరికి స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని నిస్సహాయత... ఇలాంటి పరిస్థితుల్లో నేతలంతా జావకారిపోయారు. కానీ.. క్యాడర్ మాత్రం అంతే ఉంది....

ఇప్పుడు ఎన్టీఆర్ అందరి వాడు !

నిన్నామొన్నటిదాకా ఎన్టీఆర్ అంటే టీడీపీ సొత్తు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్టీఆర్ అంటే అందరి వాడు. ఏపీలో వైసీపీ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజును నిర్వహించింది. విజయవాడతో పాటు పలు...

ఖర్చు లేకుండా పార్టీ నడుపుతున్న వైసీపీ !

రాజకీయ పార్టీ నడపడం అంటే మాటలా ? రూ. కోట్లకు కోట్లు కావాలంటారు. అయితే వైసీపీ మాత్రం అసలు ఖర్చే లేకుండా పార్టీని నడుపుతోంది. ఈ విషయాన్ని వైసీపీనే చెబుతోంది....

ఆత్మకూరు బరిలో ఆనం కుమర్తె !

ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close