బీహార్ లో మోడీ సభకు అనుమతి లేదు!

బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు రేపు జరుగుతాయి. కనుక సంబంధిత నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. మళ్ళీ అక్టోబర్ 16వ తేదీన ఆరు జిల్లాలలో రెండవ దశ ఎన్నికలు జరుగుతాయి. కనుక ఆ జిల్లాలలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు కైమూరు జిల్లాలో భాబువా స్టేడియంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలనుకొన్నారు. కానీ నక్సల్ ప్రభావిత ఝార్ఖండ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆ ప్రాంతంలో భద్రతా కారణాల రీత్యా మోడీ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ సెహ్రా తెలపడంతో బీజేపీ నేతలు షాక్ అయ్యారు.

ఆయన జిల్లా ఎన్నికల ప్రధాన అధికారిగా కూడా వ్యవహరిస్తుండటంతో బీజేపీకి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మోడీ సభకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నందున ఇప్పుడు తమ కార్యక్రమం మార్చుకోలేరు కనుక కేవలం 30, 000 మందితోనే సభను నిర్వహిస్తామని మళ్ళీ సెహ్రాకి మరో దరఖాస్తు చేసుకొన్నారు. వారి అభ్యర్ధనపై సెహ్రా స్పందిస్తూ తను స్వయంగా సభ జరిగే స్టేడియంని చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించిన తరువాతే మోడీ సభకు అనుమతి ఇవ్వాలా వద్దా…అనే నిర్ణయం తీసుకొంటానని తెలిపారు.

రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ వి. నాయక్ కి సెహ్రాపై పిర్యాదు చేసారు. ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత కల్పించే స్పెషల్ ఫోర్స్ కమెండో గ్రూప్ భాబువా స్టేడియంలో మోడీ సభ నిర్వహించడానికి క్లియరెన్స్ ఇచ్చిన తరువాత జిల్లా మేజిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే అభ్యంతరాలు తెలుపుతున్నారని తాము భావిస్తున్నామని కనుక ఈ విషయంలో కలుగజేసుకొని మోడీ సభకు అనుమతి ఇప్పించవలసిందిగా కోరారు. ఒకప్పుడు అమెరికాలో అడుగు పెట్టడానికి నరేంద్ర మోడికి అక్కడి అధికారులు అనుమతి ఈయలేదు. కానీ ఇప్పుడు అమెరికా ఆయనకి ఒక స్టార్ హీరోలాగ ఘనంగా స్వాగతం పలుకుతుంటే, నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన సభకు బీహార్ లో ఒక జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి నిరాకరించడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close