జననీరాజనాలమధ్య సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ఆయన జన్మస్థలం రామేశ్వరంలో జరిగాయి. పూర్తి సైనిక లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడి, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాష్ట్రాల గవర్నర్‌లు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుసహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సామాన్య ప్రజలుకూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఖననానికిముందు కలామ్ పార్థివదేహాన్ని ఆయన ఇంటికి సమీపంలోని ఒక మసీదుకు తీసుకెళ్ళి ప్రత్యేకప్రార్థనలు జరిపినతర్వాత అక్కడనుంచి అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి సైనిక లాంఛనాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. దీనికోసం మిస్సైల్ లాంచర్ వాహనాన్ని ఉపయోగించటం విశేషం. ప్రధాని మోడి కలామ్ సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖననానికిముందు ప్రముఖులందరూ చివరిసారిగా కలామ్ పార్థివదేహానికి పూలగుఛ్ఛాలతో నివాళులర్పించారు. మృతదేహాన్ని కప్పిన జాతీయపతాకాన్ని సైనికదళాల ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులకు అందించారు. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో ముస్లిమ్ సంప్రదాయాలతో కలామ్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రులు నాడు డమ్మీలు – నేడు పనిమంతులు !

ప్రజాస్వామ్యంలో సీఎం ఒక్కరే పాలకుడుకాదు. ఆయన నేతృత్వంలో అందరూ పని చేయాల్సిందే. కానీ కొంత మంది మాత్రం.. తప్పనిసరిగా పదవుల్ని ఇతరులకు పంచినా అధికారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తూ ఉంటారు....

పడవలు.. వీడని ప్రశ్నలు!

ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక నిజంగానే కుట్రకోణం ఉందా? ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయలనే పడవలను గాలికి వదిలేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అవును.. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు...

హైడ్రా.. అస్త్రసన్యాసమా?

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల అంతు తేల్చేందుకు తీసుకొచ్చిన హైడ్రా సంచలనం రేపింది. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఆక్రమణలను నేలమట్టం చేస్తుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించింది. ఫిర్యాదులు రావడమే ఆలస్యం డాక్యుమెంట్ల...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close