రెండేళ్ల పాటు ఫ్రిజ్డ్‌లో దాచిన పాట‌… ‘క‌ళావ‌తీ’

ఈమ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాని షేక్ చేసిన పాట `క‌ళావ‌తీ..`. ముందు ఈ పాట పెద్ద‌గా ఎక్క‌లేదు. కానీ మెల్ల‌మెల్ల‌గా స్లో పాయిజిన్‌లా మారిపోయి.. మంచి కిక్ ఇచ్చింది. యూ ట్యూబ్‌లో రికార్డుల‌న్నీ.. ఈ పాట‌వే. త‌మ‌న్ మ్యూజిక్‌, సిద్ద్ మ్యాజిక్‌… రెండూ క‌లిసి.. ఈ పాట‌ని సూప‌ర్ హిట్ చేశాయి. అయితే ఈ పాట గురించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని త‌మ‌న్ పంచుకున్నాడు.

ప్ర‌తీ పాట‌కూ.. ప‌దుల సంఖ్య‌లో ట్యూన్స్ చేయ‌డం, అందులో బెస్ట్ ట్యూన్ ఎంచుకోవ‌డం సాధార‌ణ‌మైన విష‌య‌మే. కానీ.. క‌ళావ‌తీ.. ఫ‌స్ట్ ట్యూన్‌కే ఓకే అయిపోయిన పాట‌ని త‌మ‌న్ చెప్పాడు. ట్యూన్ విన‌గానే ‘ఇది సూప‌ర్ హిట్ అవుతుంది..’ అని ప‌ర‌శురామ్ చెప్ప‌డంతో వెంట‌నే ఓకే చేశారు.

అయితే.. ఈ పాట పుట్టి రెండేళ్ల‌యిపోయింద‌ట‌. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ టైమ్‌లో ఈ ట్యూన్ ఓకే చేశార్ట‌. దాన్ని రెండేళ్ల పాటు ఫ్రిజ్డ్‌లో దాచిన‌ట్టు దాచాల్సివ‌చ్చింద‌ని త‌మ‌న్ చెప్పాడు. ”రెండేళ్ల పాటు.. పాట‌పై అదే ప్రేమ ఉండ‌డం మామూలు విష‌యం కాదు. పాట‌ని ప్ర‌తీసారీ చెక్ చేసుకుని, ‘దీనికి ఇంకా ప్రాణం ఉందా, లేదా’ అని చ‌ర్చించుకునేవాళ్లం.. పాట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేంత వ‌ర‌కూ.. అదే త‌ప‌న‌తో ప‌నిచేశాం. ఈ పాట‌పై న‌మ్మ‌కం ఉండ‌బ‌ట్టే.. రూ.30 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి లిరిక‌ల్ వీడియో కూడా చేశాం. సిద్ద్ గొంతుతో ఈ పాట‌కు మ‌రింత మైలేజీ పెరిగింది. ఇది వ‌ర‌కు కూడా సిద్ద్ నాకు పాట‌లు పాడాడు. కానీ వాట‌న్నింటికంటే భిన్నంగా ఈ పాట‌ని కంపోజ్ చేశా. ఇవ‌న్నీ క‌లిసి ఈ పాట‌ని సూప‌ర్ హిట్ చేశాయి..” అని త‌మ‌న్ చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close