కవితను గతంలో చాలా మంది షర్మిలతో పోల్చారు. ఇలా పోల్చడానికి ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మరొకటి ఆ జాబితాలో చేరింది. గతంలో షర్మిల కూడా ఎంత కాన్ఫిడెంట్ గా సీఎం అయి మీ అందరి సంగతి తేలుస్తానని ఓ సందర్భంలో బెదిరించారో ఇప్పుడు కవిత కూడా అలాగే బెదిరిస్తున్నారు. తనపై … తన భర్తపై కబ్జా ఆరోపణలు చేశారని వీరావేశంతో ప్రెస్మీట్ పెట్టిన ఆమె.. లీగల్ నోటీసులు..ఇతర ప్రక్రియను ఫాలో అవడంతో పాటు.. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా తనదైన శైలిలో హెచ్చరించారు. ఆ హెచ్చరికే తాను సీఎం కావడం.
ఏదో ఓ రోజు తాను సీఎం అవుతానని, తనపై బురద జల్లుతున్న వాళ్లకాళ్లు విరగ్గొడతానని కాన్ఫిడెంట్ గా హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ల తోలుతీస్తానంటూవార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే తన భర్త పేరు ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తన భర్త పేరు రాజకీయాల్లోకి లాగుతున్నారని వాళ్లను వదిలి పెట్టే ప్రశ్నే లేదన్నారు.
దేవుడి దయవల్ల తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని.. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతానని.. అప్పుడు ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, వాళ్ల కాళ్లు విరగ్గొడుతా, ఒక్కొక్కరి తోలు తీస్తానన్నారు. పార్టీ నుంచి నన్ను వెళ్లగొట్టారు, ఇంకా మీ కళ్లు చల్లబడలేదా, మాపై ఎందుకీ కక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని హెచ్చరించారు. తాను జాతిపిత మహాత్మా గాంధీ లాగానో లేదా కేసీఆర్ లాగా అంత మంచిదాన్ని కాదు. నన్ను ఎవరైనా ఒకటి కొడితే రెండు దెబ్బలు తిరిగి కొట్టే రకాన్ని అని కూడా హెచ్చరించారు. కవిత తన టైం వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు.
New