బంగార్రాజు క‌థ‌… ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు వెళ్లిందా??

సోగ్గాడే చిన్ని నాయ‌న‌తో ఆక‌ట్టుకొన్నాడు క‌ల్యాణ్ కృష్ణ‌. నాగార్జున‌ని తెర‌పై చూపించిన విధానం, క‌థ‌లోని మాస్ ఎలిమెంట్స్ అంద రికీ తెగ న‌చ్చేశాయి. నాగ్ కెరీర్‌లో తొలి రూ.50 కోట్ల చిత్ర‌మిది. ఆ అభిమానంతోనే నాగ‌చైత‌న్య బాధ్య‌త‌కూడా క‌ల్యాణ్ కృష్ణ‌కే అప్ప‌గించాడు నాగ్‌. రారండోయ్‌వేడుక చూద్దాంతో ద‌ర్శ‌కుడిగా పాస్ అయిపోయాడు క‌ల్యాణ్‌. అయితే సోగ్గాడే చిన్నినాయ‌న కు సీక్వెల్‌గా బంగార్రాజు తీయాల‌న్న‌ది క‌ల్యాణ్ ఆలోచ‌న‌. దానికి నాగ్‌కూడా సై అన్నాడు. కానీ మారిన స‌మీక‌ర‌ణాల దృష్ట్యా… ఈ సినిమా ఒప్పుకొనే ప‌రిస్థితిలో లేడు నాగ్‌. అందుకే ఈ క‌థ కొన్ని మార్పులు, చేర్పుల‌తో ర‌వితేజ‌కు త‌గిన‌ట్టు రాసుకొన్నాడట క‌ల్యాణ్ కృష్ణ‌. ఇటీవ‌ల ర‌వితేజ – క‌ల్యాణ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని,క‌ల్యాణ్ తో ప‌నిచేయ‌డానికి ర‌వితేజ గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది. అది సోగ్గాడేకి ప్రీక్వెల్ అయినా… ఆ ఛాయ‌లు ప‌డ‌కుండా, కొత్త క‌థ‌లా డిజైన్ చేశాడ‌ని, ఆ విధానం ర‌వితేజ‌కీ బాగా న‌చ్చింద‌ని, అందుకే ఈ కాంబో ఓకే అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. రాజా దిగ్రేట్ త‌ర‌వాత‌, ట‌చ్ చేసిచూడుసినిమాతో బిజీ అవుతున్నాడు ర‌వితేజ‌. ఆ త‌ర‌వాత శ్రీ‌నువైట్ల‌తో ఓ సినిమా చేయాల్సివుంది. క‌ల్యాణ్ కృష్ణ సినిమా మొద‌లవ్వాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.