కల్యాణ్ రామ్ కి అదిరిపోయే హిట్ పడింది పటాస్ తో. దాదాపు పదేళ్ల తరవాత హిట్ అనే మాట వినిపించింది ఈ నందమూరి హీరోకి. అయితే ఈ ఫామ్ నిలబెట్టుకోవడానికి మరో హిట్ కోసం ప్రయత్నిస్తున్న కళ్యాణ్ కు ఆ హిట్ అందడం లేదు. పటాస్ తర్వాత’షేర్’ వచ్చింది. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందీ సినిమా. పోనీ పటాస్ కు ముందు ప్రారంభించిన సినిమా అని సరిపెట్టుకున్నారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాద్ ‘ఇజం’ కూడా సరైన ఫలితం ఇవ్వలేకపోయింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కళ్యాణ్. భారీగా ఖర్చుపెట్టాడు. అటు సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. అయితే పూరి ఫ్లాపుల్లో జామా అయిపోయింది ఇజం .
పటాస్ తర్వాత ఇలా రెండు ఫ్లాఫులు తగలడంతో మళ్ళీ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఇప్పుడు కొత్త సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. వాస్తవానికి ఇజం తర్వాత జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి కళ్యాణ్. ఇదివరకే ఈ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట కళ్యాణ్. దీనికి కారణం నాగేశ్వరరెడ్డి తాజా చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’. నరేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. టేకింగ్ కూడా మరీ నాసిరకంగా కనిపించింది. ఎదో చుట్టేసినట్లు అనిపించింది. జి.నాగేశ్వరరెడ్డి అంతకుముందు తీసిన ‘ఆటాడుకుందాం రా’ కూడా ఫ్లాఫ్. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ రిస్క్ అనవసం అని భావించిన కళ్యాణ్, నాగేశ్వరరెడ్డి సినిమాని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. పవన్ సాదినేని చెప్పిన ఓ కధ విన్నాడు కళ్యాణ్. అలాగే దర్శకుడు దేవాకట్టా కూడా కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇందులో ఓ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఛాన్స్ వుంది.