కమల్ హాసన్, రజనీకాంత్ 46 ఏళ్ల తర్వాత మళ్లీ మల్టీస్టారర్‌లో కలిసి కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని ‘సైమా’ వేదికగా కమల్ ఖరారు చేశారు. లోకేష్ కనగరాజ్ వీరిద్దరి కోసం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా రాసారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్‌ని ఆయనే డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ రజనీకి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందని ఇప్పుడు హాట్ టాపిక్.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన “విక్రమ్” సూపర్ హిట్ అవ్వడం, ఆయన కెరీర్‌ను మరోసారి పుంజుకునేలా చేసింది. ఆ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, కొత్త తరానికి కమల్‌హాసన్‌ను రీ-ఇంట్రడ్యూస్ చేసిన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కమల్‌తో ఆయన జోడీ ఇప్పటికే సక్సెస్ అయ్యిందన్న ట్రాక్ రికార్డ్ ఉంది.
రజనీకాంత్‌తో లోకేష్ కలిసి చేసిన “కూలీ” మాత్రం ఫ్లాప్ అయ్యింది. రజనీ ఇమేజ్‌కి తగ్గ హైపర్ ఎలిమెంట్స్ లేకపోవడం, కథ మాస్‌కి కనెక్ట్ కాకపోవడం కారణంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. ఇప్పుడు రజనీకాంత్-లోకేష్ జోడీ మళ్లీ వర్క్ అవుతుందా అన్నది ట్రేడ్ వర్గాలు కూడా చూస్తాయి. ఎదేమైనా రజనీ-కమల్ కలసి రావడం అదొక పండగే. లోకేష్ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే మల్టీస్టారర్ అవుతుంది.