మత అసహనానికి కమల్ హాసన్ కొత్త డెఫినిషన్

దేశంలోని రాజకీయ నాయకులు అందరూ ‘మత అసహనం’ గురించి తమకు నచ్చినట్లు మాట్లాడవచ్చును కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారికి మాత్రం ఆ పదం ఉచ్చరించడానికి కూడా వీలేదు. ఉచ్చరిస్తే ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఓసారి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాని అడిగితే చెప్తారు. అసహనం గురించి మాట్లాడకూడదంటే మళ్ళీ అది కూడా మరో ‘అసహనమే’ అంటే ఏమీ చేయలేము.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఈ అసహనం గురించి మాట్లాడేశారు. మరి ఆయనకి ఏ చేదు అనుభవాలు ఎదురవుతాయో చూడాలి. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన విద్యార్ధులతో సమావేశమయినప్పుడు వారు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ “దేశంలో వివిధ మతాలకు చెందిన ప్రజలు ఒకరిపై మరొకరు సహనం చూపించుకోనవసరం లేదు..ఒకరినొకరు అంగీకరిస్తే చాలు. అసలు నేను సహనం అనే పదాన్నే వ్యతిరేకిస్తాను. దేశంలో హిందువులని, ఇతర మతస్తులని మనం ఏవిధంగా అంగీకరిస్తున్నామో ముస్లింలని కూడా అంగీకరించాలి. మూడు రంగులతో అందంగా అల్లిన ఒక స్వెట్టర్ వంటి భారతదేశం నుంచి ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే రెండు చేతులు పోగొట్టుకొన్నాము. మిగిలిన ఆ స్లీవ్ లెస్ స్వెట్టర్ లో నుంచి ఆకుపచ్చ దారాన్ని బయటకు తీయడం సాధ్యం కాదు. కనుక అందరం ఒకరినొకరు అంగీకరించుకొన్నప్పుడే దేశం ముందుకు వెళుతుంది..అభివృద్ధి చెందుతుంది,” అని కమల్ హాసన్ అన్నారు.

కమల్ హాసన్ దేశంలో ప్రజలు ఇతరుల పట్ల ‘సహనం’ ప్రదర్శించనవసరం లేదు కానీ ఒకరినొకరు అంగీకరించుకోవాలని చెప్పారు. కానీ ప్రజలు ఒకరినొకరు అంగీకరించుకోవాలంటే అందుకు వారిలో సహనం ఉండాలి. అప్పుడే ఎవరినయినా అంగీకరించగలుగుతారు. దేశంలో ముస్లిం ప్రజల పట్ల ఇతర మతస్తులు అందరూ ఆధారణ చూపించాలనే ఆయన అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు సరయినదే. దేశంలో హిందూ, ముస్లిం, క్రీస్టియన్ వంటి భిన్న మతాలకు చెందిన సామాన్య ప్రజల మధ్య నేటికీ చక్కటి సంబంధాలే ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు, నాయకులే తమ రాజకీయ లబ్ది కోసం వారి ఐక్యతను దెబ్బ తీసేవిధంగా వ్యహరిస్తుంటారు. అందుకు ఉదహారణలు కోకొల్లలుగా మన కళ్ళ ముందున్నాయి.

ఈ ‘మత అసహనం’ అనే పదాన్ని పరిచయం చేసింది రాజకీయ పార్టీలే. ఆ పదంతో యుద్ధం చేస్తున్నదీ రాజకీయ పార్టీలే. కానీ మధ్యలో అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు, అవార్డులను వాపసు చేసిన ప్రముఖులు నలిగిపోతున్నారు. బహుశః ఇప్పుడు కమల్ హాసన్ కూడా అందుకు మూల్యం చెల్లించవలసి రావచ్చును. రాజకీయ నాయకులు, మేధావులు, ప్రముఖులు దీనిపై ఎంత కాలం చర్చను కొనసాగిస్తారో అంత కాలం ఈ ఊహాజనితమయిన మత అసహనం సజీవంగానే ఉంటుంది. సామాన్య ప్రజలకు దానితో సంబంధం లేకపోయినా ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలు, వాటి నాయకుల కారణంగా వారు కూడా దానిలోకి తమ ప్రమేయం లేకుండానే యీడ్చబడతుంటారు.

ఈ మత అసహనం గురించి మాట్లాడుతున్న ఇటువంటి ప్రముఖులు అందరూ దేశంలో నానాటికీ పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలు, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యల గురించి మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడరో, ఆ సమస్యలపై తమ అమూల్యమయిన అభిప్రాయాలు ఎందుకు వ్యక్తం చేయరో, వాటి పరిష్కారం కోసం ఎందుకు కృషి చేయరో తెలియదు. ఏమయినప్పటికీ ఇప్పుడు కమల్ హాసన్ కూడా నిషిద్దమయిన అసహనం అనే పదం ఉచ్చరించారు కనుక దానికి ఆయన ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close