క‌న‌బ‌డుట‌లేదు టీజ‌ర్‌: క్రియేటివిటీ క‌నిపించింది

చిన్న సినిమాకి హంగు – ఆర్భాటాలూ ఏం ఉండ‌వు. క‌థే దాని బ‌లం. ప్రచారంతోనే జ‌నాన్ని ఆక‌ర్షించాలి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎంత వెరైటీగా కట్ చేస్తే – అంత‌గా జ‌నం దాని గురించి మాట్లాడుకుంటారు. చిన్న సినిమాగా ముస్తాబ‌వుతున్న `క‌న‌బ‌డుట‌లేదు` టీజ‌ర్‌లో ఆ క్రియేటివిటీ క‌నిపించింది. ఓ మిస్సింగ్ కేసుకి సంబంధించిన క‌థ ఇది. మ‌ధుర‌వాడ‌లోని డంప్ యార్డ్ లో రెండు శ‌వాలు క‌నిపిస్తాయి. అవి ఎవ‌రివి? క‌నిపించ‌కుండా పోయిన‌వాళ్ల‌కీ.. ఈ శ‌వాల‌కూ సంబంధం ఏమిటి? అన్న‌దే క‌థ‌. సాధార‌ణంగా ఇలాంటి మిస్సింగ్ కేసుల్లో చాలా అనుమానాలు ఉంటాయి. వాట‌న్నింటినీ ట్రైల‌ర్‌లో వైవిధ్యంగా చూపించారు. దాదాపు క‌థ‌లో పాత్ర‌లు, వాటిలో రాబోయే ట్విస్టులు ముందే రివీల్ చేసి – ఇంకాస్త ఆస‌క్తిని పెంచారు. గ‌తేడాది విడుద‌లైన కేరాఫ్ కంచ‌ర‌పాలెం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఆ సినిమాకి ప‌నిచేసిన టీమ్ లో చాలామంది ఈ సినిమాకీ వ‌ర్క్ చేశారు. అదో ప్ల‌స్ పాయింట్ అనుకోవాలి. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.