హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మధ్యతరగతి మార్కెట్ చాలా ముఖ్యం. వారు ఎంతగా ఇళ్ల కనుగోలుపై ఆసక్తి చూపిస్తారో మార్కెట్ అంతగా పెరుగుతుంది. అందుకే మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఏరియాలు ఎప్పుడూ హాట్ ప్రాపర్టీలుగానే ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఒకటి కండ్లకోయ.
కండ్లకోయ మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకునే ఉంటుంది. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది..మెట్రో ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. కండ్లకోయ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాంతంలో అనేక గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, నిర్మాణంలో ఉన్నాయి. మధ్యతరగతికి మంచి అనుకూలమైన ప్రాంతం.
కండ్లకోయలో ఇళ్ల స్థలాల ధరలు చదరపు గజానికి 25,000 వరకు ఉటోంది . రోడ్డుకు కాస్త దగ్గరగా ఉంటే ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. 2 BHK , 3 BHK అపార్ట్మెంట్ల ధరలు సుమారు 50 లక్షల నుండి 1.5 కోట్ల వరకు చెబుతున్నారు. గెటెడ్ కమ్యూనిటీల్లో ప్రశాంతమైన వాతావరణం మధ్య ఇళ్లు లభిస్తూంటాయి. బడా కంపెనీలు ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.
విద్య, వైద్య సౌకర్యలు అందుబాటులో ఉన్నాయి. కండ్లకోయలో ఆస్తి ధరలు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా పెరుగుతున్నాయి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా. రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యం ఇస్తే కొనుగోలుదారులకు ప్రయోజనం ఉంటుంది.