సుశాంత్ ఆత్మహత్య వివాదంలోకి ఉద్ధవ్ కుమారుడ్ని తెచ్చిన కంగన..!

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనను కంగనారనౌత్ మలుపులు తిప్పేస్తోంది. ఆమె ఈ వివాదాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాకరే కుమారుడికి లింక్ పెట్టేసింది. సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వారిలో.. ఓ ముఖ్యమంత్రి కొడుకు ఉన్నారంటూ…బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగిందని, దానికి ఓ ప్రముఖుడు హాజరయ్యారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆ ప్రముఖుడు ముఖ్యమంత్రి కొడుకేనని.. కంగనా తేల్చేసింది. పేరు నేరుగా చెప్పలేదు అతన్ని `బేబీ పెంగ్విన్‌` అని ప్రేమగా పిలుస్తారని ప్రకటించింది. ఉద్ధవ్ ధాకరే కుమారుడు ఆదిత్య ధాకరేను..సోషల్ మీడియాలో… ట్రోలర్స్ బేబీ పెంగ్విన్ అని పిలుస్తూ ఉంటారు. దీన్నే కంగనా సెటైరిక్‌గా వివరించింది. ఇప్పటికే ఈ కేసు బీహార్ వర్సెస్ మహారాష్ట్ర అన్నట్లుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుషాంత్ సింగ్ తండ్రి బీహార్‌లో కేసు పెట్టారు. బీహార్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సుషాంత్ తండ్రి ప్రధానంగా… రియా చక్రవర్తిపై అనుమానం వ్యక్తం చేశారు. బీహార్ పోలీసులు ముంబైకి వచ్చి విచారణ ప్రారంభించడంతో..కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది.

అయితే ఇప్పటికే సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు తేల్చారు. వైద్యాధికారుల రిపోర్టులు కూడా అంతే వచ్చాయి. సుషాంత్ ఆర్థిక లావాదేవీల్లో తేడాలు ఉండటంతో.. ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ముంబై పోలీసులు… సుషాంత్ ఆత్మహత్యపై సరిగ్గా విచారణ చేయలేదని.. విమర్శలు వినిపిస్తున్న తరుణంలో.. హీరోయిన్ కంగనా రనౌత్ .. ముఖ్యమంత్రి కుమారుని పేరు ప్రస్తావించడం.. ఈ వివాదం మరింత కాలం లైవ్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close