ఏపీ బీజేపీలో ఢిల్లీ స్థాయి నేత కన్నా ఒక్కరే !

కన్నా లక్ష్మినారాయణకు బీజేపీలో ఎట్టకేలకు గౌరవనీయమైన పదవి దక్కింది. ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయనకు పెద్దగా పని లేకుండా పోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల సోమును తొలగించి మళ్లీ కన్నాకే ఆ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయనకు చోటు దక్కింది. దేశం మొత్తం మీద 80 మంది సభ్యులు ఉన్న ఆ కమిటీలో బీజేపీకి అత్యున్నతం. అందులో ఏపీ నుంచి ఒక్క కన్నా లక్ష్మినారాయణకు మాత్రమే చోటు దక్కింది. తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు.

ఈ కమిటీలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి , రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి ముఖ్య నేతలందరూ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యాభై మందిని ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఏపీ నుంచి ఎవరూ లేరు. తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించారు. పార్టీలకు ఉన్న బలాన్ని బట్టి.. బలమైన నేతలను బట్టి ఈ కమిటీలో ప్రాథినిధ్యం కల్పించారు. ఏపీలో చెప్పుకోదగిన బీజేపీ నేత ఎవరూ లేకపోవడంతో కన్నాకు అవకాశం దక్కింది.

మరో వైపు ఈ పదవుల నుంచి తమ పార్టీలో ఉన్న గాంధీలను బీజేపీ దూరం పెట్టింది. మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా చేశారు. ఇటీవల రైతులపై కారుతో దూసుకెళ్లిన ఘటన వ్యవహారంలో వరుణ్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఆ పార్టీ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారింది. అందుకే వారిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close