సుజనాకు ప్రాధాన్యంపై కన్నా అసంతృప్తి..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అనూహ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎంపీలు చేరిన తర్వాత .. ఏపీలో క్షేత్ర స్థాయిలో..ఆ పార్టీలో.. లుకలుకలు ప్రారంభమయ్యాయి. పాత తరం బీజేపీ నేతలు.. ఎక్కడో వెనుకబెంచికి పరిమితవుతూండగా.. మధ్యలో వచ్చిన నేతలు.. ఇప్పటి వరకూ అగ్రతాంబూలం దక్కించుకున్నప్పటికి..ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోతున్నారు. కొత్తగా చేరిన నేతలకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతూండటంతో.. రెండు వర్గాలు.. అసంతృప్తితో ఉన్నాయి.

కన్నాకు సంబంధం లేకుండా సాగిపోతున్న బీజేపీ వ్యవహారాలు..!

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉండేవారు. ఆయనను పట్టుబట్టి మరీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.. అమిత్ షా. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత… కన్నాకు బీపీ రావడంతో.. స్టోరీ చేంజ్ అయింది కానీ.. లేకపోతే.. ఆయన బహుశా.. ఇప్పుడు వైసీపీ కేబినెట్‌లో మంత్రిగా ఉండి ఉండేవారు కావొచ్చు. అయితే.. కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తుందని.. కేంద్ర స్థాయిలో ఏదో ఓ పదవి వస్తుందన్న ఆశతో.. అమిత్ షా చెప్పినట్లు విన్నారు. బీజేపీలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆయన పరిస్థితి ఏటూ కాకుండా పోతోంది. ఇప్పుడు.. కన్నాకు.. హైకమాండ్ నుంచి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఆయనకు సంబంధం లేకుండానే.. ఏపీ వ్యవహారాలు.. ఉత్తరాది నేతల చేతుల మీదుగా సాగిపోతున్నాయి.

కన్నా అసంతృప్తి అలా బయట పెట్టారా..?

టీడీపీ ఎంపీల చేరికలపై… కన్నాకు కనీస సమాచారం లేదు. ఎంపీలు మాత్రమే కాదు.. ఆ తర్వాత చాలా మందిని బీజేపీలో చేర్చుకోవడానికి బేరసారాలు ఆడారు కానీ.. వారి గురించి కన్నాతో కనీస చర్చలు కూడా జరపలేదు. పైగా… ఏపీకి వస్తున్న జాతీయ నేతలు.. సుజనా నేతృత్వంలో బీజేపీ బలపడుతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో.. కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తికి గురవుతున్నారు. తనను పక్కన పెట్టేస్తున్నారన్న ఫీలింగ్‌తో ఆయన ఉన్నారు. అందుకే… గత ఆదివారం సుజనా చౌదరి.. ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ఆయన.. అసలు ఆ కార్యక్రమానికే డుమ్మాకొట్టారు. ఒక్క కన్నా మాత్రమే కాదు.. చాలా మంది నేతలు.. ఆ ఆత్మీయ సమావేశానికి హాజరు కాలేదు.

పాతకాపుల పరిస్థితేమిటి..?

బీజేపీలో చాలా కాలం నుంచి ఉన్న నేతల ఆచూకీ కనిపెట్టడం ఇప్పుడు కష్టంగా ఉంది. సోమువీర్రాజు.. వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఇక విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్లు ఎప్పుడో ఒకసారి కనిపిస్తూంటారు. వారి మాటలు ఆలకించేవారు కూడా లేరు. ఇప్పుడు.. బీజేపీలో అంతా సుజనా హవానే కనిపిస్తోంది. చేరికల విషయంలోనూ ఆయనకే హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఏపీ బీజేపీలో కొత్త తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close