వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటున్న బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ… విరామం లేకుండా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు. గతంలో ప్రజాసమస్యలపై లేఖలు రాసిన ఆయన ఈ సారి మాత్రం.. కేసుల మీద దృష్టి పెట్టారు. శనివారం ఐటీ గ్రిడ్ కేసులో ఏం చర్యలు తీసుకున్నారని.. జగన్ ను ప్రశ్నించిన ఆయన.. ఆదివారం మరింత … ఎక్స్‌ట్రీమ్ లేఖ రాశారు. ఈ సారి ఆయన లేఖ రాయడానికి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసును ఎంచుకున్నారు. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. సీఎంకు లేఖ రాశారు. వివేకా హత్య కేసు నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని లేఖలో ప్రశ్నించారు. మార్చిలో హత్య జరిగిందని.., ఇప్పటి వరకూ నిందితుల్ని అరెస్ట్ చేయలేదంటే.. ప్రభుత్వానికి చేతకావడం లేదని.. అందుకే.. కేసును సీబీఐకి అప్పగించాలని.. కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు.

కన్నా లక్ష్మినారాయణ … చాలా కాలం నుంచి లేఖలు రాస్తున్నారు. ఆయితే.. ఆ లేఖలను సీఎంవో పట్టించుకోవడం మానేసింది. మొదట్లో…. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తాను లేఖ రాసినా పట్టించుకోవడం లేదని.. కనీసం స్పందించడం.. మర్యాదించడం లాంటిదని.. ఆయన జగన్‌కు మీడియా ముఖంగానే హితవు పలికారు. అయితే.. జగన్ అలాంటివి పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి కన్నా లక్ష్మినారాయణ బహిరంగ లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఇసుక కొరతపై చాలా లేఖలు రాశారు.. ఇప్పుడు.. కేసుల గురించి లేఖల సిరీస్ ప్రారంభించారు.

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్నది… కన్నా డిమాండ్ మాత్రమే కాదు.. టీడీపీ డిమాండ్ కూడా. ఇంకా చెప్పాలంటే.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు… జగన్మోహన్ రెడ్డి డిమాండ్ కూడా. ఆయన ఎప్పుడు సీఎం అయ్యారో.. అప్పుడు యూటర్న్ తీసుకున్నారు. వివేకా కేసు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఏపీ పోలీసులు సమర్థంగా విచారించగలరని చెప్పుకొస్తున్నారు. ఇదే ఏపీ పోలీసుల్ని నమ్మలేమని.. గతంలో జగన్ చెప్పారు. మొత్తానికి వివేకా కేసు.. మరో సారి హాట్ టాపిక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close