విజ‌య్ కేర్ టేక‌ర్‌గా మారిన క‌ర‌ణ్ జోహార్‌

సౌత్ హీరోల్లో ఎంత స్టామినా ఉందో.. క‌ర‌ణ్ జోహార్‌కి బాగా తెలుసు. అందుకే తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా వ‌స్తోందంటే, ఆ సినిమాకి బాలీవుడ్ లో త‌న వంతు ప్ర‌చారం చేసి పెడుతున్నాడు క‌ర‌ణ్ జోహార్‌. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల స్థాయి… రాజ‌మౌళి సినిమాల‌తో క‌ర‌ణ్ కి అర్థ‌మైంది. మిగిలిన తెలుగు టాప్ హీరోలూ.. ఏదో ఓ రోజు బాలీవుడ్ ని షేక్ చేస్తార‌ని క‌ర‌ణ్ ముందే ఊహించాడు. అందుకే కొంత‌మంది తెలుగు హీరోల‌కు ఆయ‌న కేర్ టేక‌ర్‌గా మారిపోయాడు. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. `లైగ‌ర్‌` తెలుగులో స‌రిగా ఆడ‌లేదు కానీ, బాలీవుడ్ లో మంచి వ‌సూళ్లే సాధించింది. బాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌కి అదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. విజ‌య్ స్టామినా అంచ‌నా వేసిన క‌ర‌ణ్‌… బాలీవుడ్ ప్రాజెక్టుల్ని సెట్ చేసే బాధ్య‌త త‌న భుజాన వేసుకొన్నాడు.

ఈమ‌ధ్య `గుడ్ బై` అనే సినిమా తీశాడు వికాస్‌. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌ధారి. ర‌ష్మిక కూడా న‌టించింది. కంగనా `క్వీన్‌`కీ త‌నే ద‌ర్శ‌కుడు. క్వీన్ క‌మర్షియ‌ల్ గా మంచి విజ‌యాన్ని అందుకొంది. అవార్డులూ తెచ్చిపెట్టింది. వికాస్‌…విజ‌య్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేశాడు. ఆ క‌థ‌.. విజ‌య్‌కి బాగా న‌చ్చింది. వికాస్ తో రెండు మూడు సిట్టింగులు కూడా జ‌రిగాయి. ఈ సినిమాని ఓకే చేసేద్దాం అని విజ‌య్ భావిస్తున్న త‌రుణంలో.. క‌ర‌ణ్ `నో` చెప్పాడ‌ని టాక్‌. అప్ప‌టికి `గుడ్ బై`విడుద‌ల కాలేదు. `గుడ్ బై రిపోర్టు బాలేదు. ఈ సినిమా ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆడ‌దు. ఆ త‌ర‌వాత వికాస్ తో సినిమా తీస్తే.. క్రేజ్ రాదు. అందుకే ఈ సినిమా చేయ‌కు` అని క‌ర‌ణ్ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. క‌ర‌ణ్ అనుభ‌వాన్ని, త‌న‌తో ఉన్న స్నేహాన్నీ దృష్టిలో ఉంచుకొన్న విజ‌య్‌.. ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టాడు. క‌ర‌ణ్ చెప్పిన‌ట్టే `గుడ్ బై` సినిమా విడుద‌లై.. అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఒక వేళ ఈ సినిమా విజ‌య్ ఒప్పుకొని ఉంటే.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి సినిమా చేయాల్సివ‌చ్చేది. త్వ‌ర‌లోనే విజ‌య్ ఓ బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్నాడు. అందుకు సంబంధించిన డిస్కర్ష‌న్స్ వాడీ వేడీగా జ‌రుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులోనూ క‌ర‌ణ్ హ్యాండ్ ఉండే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close