తెలుగు రాష్ట్రాలలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా అపార్టుమెంట్ల ఎత్తు క్రమంగా పెరుగుతోంది. ఏపీలోని నెల్లూరులో 30 అంతస్తుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పుడు తెలంగాణలోనూ కరీంనగర్ లోనూ అలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. అపార్టుమెంట్లలో ఉండే ప్లస్ పాయింట్ల కారణంగా ఎగువ మధ్యతరగతి కుటుంబాలు.. వాటిలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వాటి నిర్మాణం .. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఊపందుకుంటోంది.
కరీంనగర్లో 14 అంతస్తుల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు అక్కడ విస్తృతంగా చర్చ జరుగుతోంది. 3 ఎకరాలు విస్తీర్ణంలో 252 యూనిట్లు గా నిర్మిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇప్పటి వరకూ కరీంనగర్లో అపార్టుమెంట్లు అంటే.. ఐదు అంతస్తులే ఎక్కువ. ఎవరూ అంత కంటే ఎక్కువగా నిర్మించేందుకు ఆసక్తి చూపించలేదు. తొలి సారిగా 14 అంతస్తులతో కరీంనగర్లో మొట్టమొదటి హై-రైజ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిర్మిస్తున్నారు.
మూడు ఎకరాల్లో నిర్మిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. స్మిమ్మింగ్ పూల్, జిమ్ సౌకర్యవంతమైన లేఅవుట్లు, బాల్కనీలు, కమ్యూనిటీ హాల్, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు ఆదరణ లభిస్తే మరింత మంది బిల్డర్లు ఇలాంటి అపార్టుమెంట్లను నిర్మించే అవకాశం ఉంది.