కరీంనగర్లో వెలుగుచూసిన దంపతుల మోసం .. ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వ్యాపారంలో నష్టాలు చ్చాయని దంపతులు ఎంచుకున్న మార్గం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఇన్ స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచి, మొదట అర్థనగ్న వీడియోలతో వల విసిరిన ఈ జంట, ఆపై విటులను ఆకర్షించడం మొదలుపెట్టారు.
డబ్బుపై ఆశ పెరగడంతో, కామ వాంఛతో వచ్చే వారిని నిలువునా ముంచేందుకు ఒక కిరాతక ప్లాన్ను అమలు చేశారు. తమ వద్దకు వచ్చే విటులతో భార్య శృంగారంలో పాల్గొంటుండగా, భర్త రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. ఇలా ఏకంగా వంద మందికి పైగా వ్యక్తులతో ఆ భార్య గడపింది. భర్త వాటన్నింటినీ రికార్డు చేశాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతాం.. మీ కుటుంబ సభ్యులకు పంపిస్తాం అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేశారు. పరువు పోతుందనే భయంతో చాలామంది బాధితులు మౌనంగానే వారి అడిగినంత సమర్పించుకున్నారు.
అయితే, ఈ పాపం ఎంతో కాలం సాగలేదు. తాజాగా ఓ బాధితుడిని వారు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో, భరించలేకపోయిన అతను సాహసించి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు నిఘా పెట్టి, పక్కా ఆధారాలతో ఈ కిలాడీ దంపతులను అరెస్ట్ చేశారు. వందలాది వీడియోలు ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ దంపతుల వికృత చేష్టలను చూసి విస్తుపోయారు. ప్రస్తుతం ఈ జంట జైలు ఊచలు లెక్కపెడుతోంది. పరువు కోసం లక్షలు సమర్పించుకున్న వారు తమ వివరాలు ఎక్కడ బయటకు వస్తాయోనని కిందా మీదా పడుతున్నారు.
