కరీంనగర్ జిల్లా రివ్యూ: కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కనిపిస్తోందా..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. అయితే 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. కారు పార్టీ జోరు చూపించింది. అయితే అదే దూకుడు ఇప్పుడు ఉంటుందా అంటే మాత్రం అనుమానమేనన్న పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ రద్దు చేసేవరకు జిల్లాలో టీఆర్ఎస్‌కు ఎదురులేదన్న భావన ఉండేది. ఆ తరువాత వేగంగా మారుతున్న పరిణామాలతో లెక్కలు మారిపోతున్నాయి. కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ప్రచారంలో ముందు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా.. కరీంగనగర్‌లో బీజేపీ పోటీచేసింది. రెండో స్థానంలో నిలిచింది. ఈ సారి టీడీపీతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ తరపున పొన్నం ప్రభాకర్ రంగంలో ఉండటంతో.. రేస్ ఉత్కంఠఛగా మారింది. పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ అభ్యర్థికి ధీటుగా రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతున్నారు. మూడు పార్టీల నుంచి గట్టి అభ్యర్ధులే బరిలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోరు కనిపిస్తుంది.

హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి అయిదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆర్ధికమంత్రిగా నియోజకవర్గానికి వేలకోట్ల రూపాయలు మంజూరు చేశారన్న ఇమేజ్ ఉంది. మహాకూటమి తరుపున కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ బంధువు పాడి కౌశిక్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి పుప్పాల రఘు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈటల, కౌశిక్ రెడ్డి మధ్యనే పోటీ ఉంది. హుజూరాబాద్, కమలాపూర్ మండలాల్లో టీఆర్ఎస్ బలం ఉంది. వీణవంక, జమ్మికుంట మండలాలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

చొప్పదండి నియోజకవర్గంలో కేసీఆర్ చివరికి వరకూ టిక్కెట్ ఖరారు చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగే శోభకు టిక్కెట్ నిరాకరించడానికి ఆమె ప్రత్యామ్నాయం వెదుక్కునే వరూక ఎదురు చూశారు. ఆఖరి నిమిషం వరకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ తర్వతా సుంకె రవిశంకర్ కు టిక్కెట్ ప్రకటించారు. అధికారపార్టీకి పడాల్సిన ఓట్లు శోభ చీల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలు తనకు కలిసొస్తాయనే ఆశతో ఉన్నారు కూటమి అభ్యర్ధి మేడిపల్లి సత్యం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పట్టుబట్టి మేడిపల్లి సత్యంకు టిక్కెట్ ఇప్పించారు. గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు. ప్రభావం చూపించే కొంత మంది నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.

మానకొండూరు నియోజకవర్గంలో పరిస్థితి చిత్రంగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉన్నా… అభ్యర్ధిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. టిక్కెట్లు ప్రకటించిన రోజు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించాయి. అవి క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రసమయి స్థానికుడు కాదని, ప్రజాప్రతినిధిగా మెప్పించలేకపోయారని సొంతపార్టీలోనే ఓ వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ పరిణామాలను క్యాష్ చేసుకోవడానికి కూటమి అభ్యర్ధి ఆరేపల్లి మోహన్ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. బీజేపీ నుంచి గడ్డం నాగరాజు బరిలో ఉన్నా… ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కూటమి అభ్యర్ధుల మధ్యే కనిపిస్తుంది. హుస్నాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బరిలో ఉండగా…, కూటమి తరపున సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీలతో పాటు రెబల్స్ కూడా బరిలో ఉన్నా… ప్రధాన పోటీ సతీష్, చాడా మధ్యే జరగనుంది. అభివృద్ధి నినాదం గట్టెక్కిస్తుందని సతీష్ నమ్ముతుంటే…, సొంత క్యాడర్తో పాటు కాంగ్రెస్, టీడీపీ ఓట్లు గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు చాడా వెంకట్రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close