కర్ణాటకంలో గవర్నర్ వర్సెస్ స్పీకర్..?

కర్ణాటకంలో.. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెర ముందు పాత్ర పోషించడానికి రెడీ అయింది. ఇప్పటి వరకూ.. కలసి వచ్చే ఎమ్మెల్యేలందర్నీ క్యాంపునకు తీసుకుపోయిన ఆ పార్టీ… ఇప్పుడు… కుమారస్వామి రాజీనామాకు పట్టుబట్టాలని నిర్ణయించుకుంది. రాజీనామా చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు.. నేరుగా ప్రత్యేక విమానాల్లో… ముంబైకి వెళ్తున్నారు. అక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తున్నారో కానీ… వారందర్నీ కలిపి ఉంచడానికి ఓ నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ మాత్రం… ఆ క్యాంపుల గురించి తమకు తెలియదంటోంది. అసలు ఆ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంబంధం లేదంటోంది. అంతేనా..ఆ ఎమ్మెల్యేలు కూడా అదే చెబుతున్నారు. తమ వెనుక బీజేపీ లేదంటున్నారు. తెర వెనుక రాజకీయాన్ని పక్కన పెడితే.. తెర ముందు మాత్రం… బీజేపీ సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ప్రజా మద్దతు కోల్పోయారని కర్ణాటక బీజేఎల్పీ ఆరోపించింది. ఆయన రాజీనామా కోరుతూ ఉద్యమం చేయాలని యడ్యూరప్ప నిర్ణయించారు.

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ చెరో చోట క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. ముంబైలో ఉన్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలను గోవా తీసుకెళ్లేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నించింది. పుణె తీసుకెళ్లి అక్కడ నుంచి గోవా తీసుకెళ్లాలనుకుంది. అయితే చివరిలో ప్లాన్ మార్చుకుంది. మళ్లీ ముంబైలోనే ఒక హోటల్లో ఉంచింది. జేడీఎస్ కూడా ముందు జాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. సీఎం కుమారస్వామి ఎప్పటికప్పుడు వారితో టచ్‌లో ఉంటూ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా చూసుకుంటున్నారు. మంత్రి పదవులు ఇవ్వనందునే తాము బైటకురావాల్సి వచ్చిందని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. వారి కోసం మంత్రి పదవుల్ని ఖాళీ చేసి పెట్టారు కుమారస్వామి.

స్పీకర్ వెంటనే చర్య తీసుకునే అవకాశం లేకపోవడంతో ఎవరు ఎటు పోతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరితో 12 నుంచి 15వ తేదీ వరకు మాట్లాడాలని స్పీకర్ నిర్ణయించుకున్నారు. రాజీనామా చేసిన వారందిరినీ వెంటనే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆరేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతోంది. మరో వైపు .. గవర్నర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన కుమారస్వామిని బలనిరూపణ చేసుకోమని కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close