మత మార్పిడి నిరోధక చట్టాలు తెస్తున్న రాష్ట్రాలు ! ఏపీ సంగతేంటి ?

బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాలు కొత్తగా చట్టాలను తీసుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అలాంటి చట్టాన్నే అసెంబ్లీ ఆమోదించింది. మత మార్పిళ్లను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని చట్టాలు చేసిన ప్రభుత్వాలు నొక్కి చెప్పాయి. ఒడిశా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో ఈ మత మార్పిడి వ్యతిరేక చట్టాలున్నాయి. ఈ జాబితాలో కర్ణాటక చేరింది. మరికొన్ని రాష్ట్రాలు ఈ తరహా చట్టాలు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో చట్టాల్లో ఒకే రకమైన నిబంధనలు లేవు. చాలా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అదే సమయంలో హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ల ద్వారా ఇస్లాంలోకి మారుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా .. ఎవరి ప్రభావం ఎక్కువ ఉందో.. ఆయా రాష్ట్రాల్లో వారికి వ్యతిరేకంగా నిబంధనలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల అంశం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఏపీలోని గిరిజన నియోజకవర్గాల్లో క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడ్డాయని ఇప్పటికే అనేక నివేదికలు తేల్చాయి. ఇప్పుడు కొత్తగా గ్రామాల్లోనూ.. పట్టణాల్లోనూ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని అనేక ఆరోపణలు కేంద్రానికి వెళ్లాయి. నివేదికలు ఇవ్వాలని కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చినా పట్టించుకోలేదు.

ఇలాంటి సమయంలో ఏపీలోనూ మత మార్పిడి నిరోధక చట్టం అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రలోభాలు ఆశ పెట్టి.. లేకపోతే మరో కారణంతోనో మత మార్పిడి చేపడితే శిక్ష విధించాలన్న వాదన వినిపిస్తోంది. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసే అవకాశం లేదు. ఎందుకంటే మత మార్పిళ్లకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉందన్న అభిప్రాయం బలంగా ఉండటమే కారణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close