చిరంజీవి టైటిల్ తో పబ్లిసిటీ వస్తుందన్న ఆలోచన లేదు : కార్తికేయతో ఇంటర్వ్యూ

ఒక్క సినిమాతోనే యూత్ ఫుల్ హీరో అయిపోయాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమా కార్తికేయ జాతకాన్ని మార్చేసింది. ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ నుంచి సినిమా వస్తుందంటే ఒక ఆసక్తి. ఇప్పుడు కార్తికేయ నుంచి మరో సినిమా వస్తుంది. అదే ‘రాజా విక్రమార్క’. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ స్ఫూర్తిగా ఈ సినిమా తీశానని దర్శకుడు శ్రీ సరిపల్లి చెబుతున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తిగా వుంది. ఈ నెల 12న పేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలని పంచుకున్నాడు కార్తికేయ.

పెళ్లి, కొత్త సినిమా ప్రమోషన్స్ ఒక్కసారే పెట్టుకున్నారు.. ఎలా అనిపిస్తుంది ?

అవును. కొత్త సినిమాల షూటింగ్ కూడా జరుగుతుంది. పెళ్లికి బ్రేక్ తీసుకొని మళ్ళీ డిసెంబర్ లో స్టార్ట్ చేస్తాం.

‘రాజా విక్రమార్క’గా కొత్తగా కనిపిస్తున్నారు.?

ఇంత కామెడీ టైమింగ్ వున్న పాత్ర ఇది వరకు ఎప్పుడూ చేయలేదు. డ్రెసింగ్, క్లాసీ నెస్ అన్నీ కొత్తగా వున్నాయి. జోనర్ కూడా ఇప్పటివరకూ నేను టచ్ చేయనిది.

‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ స్ఫూర్తిగా ఈ సినిమా కథ చేశానని దర్శకుడు చెబుతున్నారు. మీకు ఎలా అనిపించింది ?

‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లా వుంటుందని కాదు. రెండున్న గంటల పాటు కథ నుంచి పక్కకు జరక్కుండా నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాం. ప్రతి సెకన్ ఆసక్తికరంగా వుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వుంటుంది.

కథ విని మూడేళ్ళు అవుతుందన్నారు. మూడేళ్ళు పాటు మిమ్మల్ని ఎక్సయిట్ చేస్తూ వుంచిన పాయింట్ ఏమిటి ?

కథ డీల్ చేసిన విధానం. తెలుగులో ఇలాంటి స్టయిలీష్ కాప్ సినిమాలు చాలా తక్కువ. దర్శకుడితో మాట్లడినప్పుడే ఆయన ఇలాంటి సబ్జెక్టు తీయగలడని అనిపించింది. మేకింగ్ లో ఆ నమ్మకం ఇంకా పెరిగింది

ఈ సినిమా దర్శకుడు హాలీవుడ్ లో పని చేయడం వలన ఇది సాధ్యపడింది అనుకుంటున్నారా ?

ఖచ్చితంగా. ఫిల్మ్ స్కూల్ లో చదువుకోవడం, అక్కడ ఇండిపెండెంట్ సినిమాలు చేయడంతో ఒక అనుభవం వచ్చివుంటుంది. ఐతే అక్కడ పని చేసిన వాళ్ళు అంతా ఇలా పని చేస్తారని అనుకోను. ఎవరి స్టయిల్ వారిది.

‘రాజా విక్రమార్క’ టైటిల్ వినగానే చిరంజీవి గారి సినిమా గుర్తుకువస్తుంది ?

నిజానికి ఈ టైటిల్ నేనే చెప్పా. దర్శకుడు రెండు రోజులు అలోచించాడు. చిరంజీవి గారి టైటిల్ తో పబ్లిసిటీ వస్తుందనుకునే ఆలోచన ఆయనకు లేదు. ఈ సినిమాకి సరిపోతుందా లేదా అని అలోచించి .. యాప్ట్ టైటిల్ అని నమ్మిన తర్వాతే ఫిక్స్ చేశాం. చిరంజీవి గారి టైటిల్ తో ఇప్పటివరకూ నాకు సినిమా లేదు. ‘రాజా విక్రమార్క’ టైటిల్ లోనే వినోదం, బలం రెండూ వున్నాయి.

ఎన్ ఐ ఎ ఏజెంట్ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ?

ఎన్ ఐ ఎ ఏజెంట్ అంటే బోర్డ్ లేదా ఏదైనా వార్ బ్యాక్డ్రాఫ్ లో నడిచే స్టొరీ కాదు. ఒక మిషన్ మీద వచ్చినపుడు తనకు ఎదురైన పరిస్థితులపై కథ వుంటుంది. దీని కోసం ప్రిపరేషన్ అంటే దర్శకుడితో కూర్చునే ఎక్కువ సేపు గడిపా. యాక్షన్, టైమింగ్ ఇవన్నీ దర్శకుడి సజెషన్ లోనే జరిగాయి.

‘రాజా విక్రమార్క’ లో హీరో.. అజిత్ వలిమైలో విలన్ ఒకేసారి చేశారు ఎలా అనిపించింది ?

ఏదైనా పాత్రే కదా. పాత్ర స్వభావాన్ని తెలుసుకొని నటించడమే.

అజిత్ లాంటి స్టార్ తో చేయడం ఎలా అనిపిచింది ?
అజిత్ గొప్ప మనిషి. ఆయనతో కలిసేవరకు ఒక టెన్షన్ వుండేది. కానీ ఒకసారి కలిసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సెట్ బాయ్ నుంచి హీరో వరకూ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభూతి.

‘రాజా విక్రమార్క’ లో యాక్షన్, కామెడీ రెండూ చేశారు . ఏది కష్టం ?

ఇది వరకు యాక్షన్ చేశాను. నా యాక్షన్ ని ప్రేక్షకులు ఆదరించారు. కానీ కామెడీ విషయానికి వచ్చేసరికి కొంత భయం వుంది. కామెడీ లో నాకు ఇంకా యాక్సప్టెన్సీ రాలేదు. ఈ సినిమాకి కామెడీలో కూడా పట్టు సాధించానని నమ్మకం.

ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని సినిమా చేస్తానని చెప్పారు. ఇంతకుముందు ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని చేశారా ?

ఇంతకుముందు ఇమేజ్ కోసం, మార్కెట్ కోసం కొన్ని చేశాను. ఇది తప్పు అని కాదు. అయితే దిని వలన కధని మిస్ అవుతున్నామా ? అనిపిచింది. నేను చేసిన నాలుగు సినిమాలు ఒక్కటీ విజయం సాధించలేదు. ఇంక ఇమేజ్, మార్కెట్ అనే లెక్కలు అనవసరం అనిపిచింది. కధ విన్నప్పుడు హీరోలా కాకుండా ఒక ఆడియన్ లా విని నచ్చిందా లేదా అని చెక్ చేసుకొని నచ్చితే చేసేయడమే. ఇలా చేయడం వలన సినిమా సూపర్ హిట్ కాకపోయినా ఫ్లాఫ్ కాదు. అలా ఒకొక్కటి చేసుకుంటూ వెళితే మార్కెట్ వస్తుంది. తప్పితే మార్కెట్ కోసమే సినిమా చేయాలనే అభిప్రాయం కరెక్ట్ కాదనే నిర్ణయానికి వచ్చాను.

ఈ సినిమా కథని ఆడియన్ లానే వున్నారా ?

– ఎస్. నా ముందు సినిమాల అపజయానికి కారణాలు నోట్ చేసుకున్నాను. ఈ సినిమా లో ఆ కారణాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నా.

మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి ?

అన్నీ జోనర్లు చూస్తాను. ఇప్పుడు సినిమాల ఈక్వేషన్ మారింది. ట్రెండ్ మారింది. చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు. వారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు ? ఎంత ట్రెండ్ తో చేస్తున్నారో తెలుసుకొని చేయాలి.

కొత్త సినిమా కబుర్లు ?

యూవీ క్రియేషన్ లో ఓ సినిమా చేస్తున్నా. క్లాక్స్ అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నా. శ్రీదేవి మూవీస్ లో మరో సినిమా. తమిళ్ వలిమై సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. తమిళ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

అల్ ది బెస్ట్

థ్యాంక్ యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close