కార్తి కొత్త సినిమా ‘జపాన్’

కార్తికి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. పోన్నియన్ సెల్వన్ లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర దక్కింది. సర్దార్ తో దీపావళి విజేతగా నిలిచాడు కార్తి. ఇప్పుడు ఆయన కొత్త సినిమాతో ప్రారంభమైయింది. రాజు మురగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు జపాన్. డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో కార్తి చేస్తున్న ఆరో సినిమా ఇది. అలాగే కార్తికి ఇది 25వ సినిమా.

కార్తి జోడిగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. అలాగే సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ లాంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. రాజు మురగన్ తీసిన ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డ్ వచ్చింది. వినోదంతో పాటు సందేశాత్మక చిత్రాలు తీయడంతో అతనికి మంచి పేరుంది. జపాన్ కోసం కూడా ఇలాంటి కథని ఎంచుకున్నారని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

జక్క‌న్న‌కు అంత టైమ్ ఉందా?

రాజ‌మౌళి ఈమ‌ధ్య బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం చాలా త‌క్కువ‌. సినిమా వేడుక‌ల్లో చూడ‌డం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. త‌న టైమ్ అంతా మ‌హేష్ బాబు సినిమా కోస‌మే....

HOT NEWS

css.php
[X] Close
[X] Close