శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి పది మందికిపైగా చనిపోయారు. ఏకాదశి అని చెప్పి నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒకే సారి రెండు వేల మంది వస్తే కిక్కిరిసిపోయే ఆలయానికి ఒక సారిగా ముఫ్పై వేల మంది వచ్చారు. ఆలయం రెండో అంతస్తులో స్వామి వారి దర్శనం ఉంటుంది.
మెట్లు ఎక్కే రెయిలింగ్ బలహీనంగా ఉంది. తోసుకోవడంతో రెయిలింగ్ విరిగిపోయింది. అక్కడి నుంచి అంతా ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఇలా జనం వస్తారని ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వలేదు. దీంతో దుర్ఘటన జరిగిపోయింది. పది మంది మృతుల్లో తొమ్మిది మంది మహిళలు.. ఒక బాలుడు. మరికొందరు గాయపడ్డారు. వారిలో ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నారా లోకేష్ తో పాటు హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి వెళ్తున్నారు.
ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు వచ్చేలా ప్రైవేటు అలయా ల నిర్వహాకులు ప్రచారం చేస్తున్నారు. వీటిపై దేవాదాయశాఖకు నియంత్రణ ఉండకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. యంత్రాంగం సహాయ చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
