ఏపీలో కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఒకటి వీకావేరి బస్సు ప్రమాదం. రెండు కాశిబుగ్గ తొక్కిసలాట. ఈ రెండింటింలో ప్రభుత్వ తప్పిదం ఉందని చెప్పడానికి ఒక్క అవకాశం లేదు. ఎందుకంటే వీ కావేరి బస్సు ప్రమాదం.. కర్నూలులో జరిగింది .. తప్పితే. రోడ్లు బాగోలేకపోవడం లేదా మరో సమస్య కారణం కాలేదు. అలాగే కాశిబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనలోనూ అదే జరిగింది. అది పూర్తిగా ప్రైవేటు ఆలయం.. అంత మంది భక్తులు వస్తారని ఆలయ నిర్వహకులు కూడా నమ్మలేకపోయారు.
ఈ రెండు సందర్భాల్లోనూ తమపై శవరాజకీయాలు చేస్తారని తెలిసి కూడా ప్రభుత్వం చురుకుగా స్పందించి. ప్రాణాలు కాపాడేందుకు.. భయపడేవారికి ధైర్యం ఇచ్చేందుకు వెంటనే రంగంలోకి దిగింది. గాయపడిన వారికి సమగ్రమైన చికిత్సలు అందించింది. తమపై విమర్శలు చేస్తారని పట్టించుకోనట్లుగా.. పెద్ద విషయంకాదన్నట్లుగా ఉంటే.. మూడో రోజు మీడియా కూడా సైలెంట్ అయ్యేది. కానీ ప్రభుత్వం అలా అనుకోలేదు. తనపై నెగెటివ్ ప్రచారం జరిగినా కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకవాల్సిన అవసరం ఉందని అనుకుంది. చేయాలనుకున్న పని చేసేసింది.
అంటే రాజకీయ విమర్శలు వస్తాయని.. శవరాజకీయాలు చేస్తారని తెలిసినా … అవెప్పుడూ ఉండేవే కదా అని.. తన బాధ్యతలను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అవి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా వెంటనే స్పందించింది. ప్రజాప్రాణాలకు .. రాజకీయాలకు అతీతంగా తాము తమ వంతు రక్షణగా ఉంటామని నిరూపించారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించాలనుకునేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారు. అప్పుడూ విమర్శలు చేశారు. ఇప్పుడూ చేస్తున్నరు. ఈ విమర్శల బారి నుంచి తప్పించుకోవడానికి సమస్యలపై దుప్పటి కప్పలేదు.
అయితే మంచితనం చేతకాని తనం దాకా వెళ్లడమే సమస్యలు సృష్టిస్తోంది. ప్రభుత్వం బాధ్యతలను పక్కాగా నిర్వర్తిస్తోంది. నివారించలేని ప్రమాదాలు జరిగినా తప్ప విమర్శలు చేస్తారని అనుకుంటున్నా తగ్గడం లేదు. ప్రభుత్వ అనుమానాలకు తగ్గట్లే ప్రమాదాలు జరిగినప్పుడు .. శవరాజకీయాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతోంది. అయితే అది ఒక అడుగు వెనక్కి వేయడమేనని .. తాము సిక్సర్లు కొడతామని.. టీడీపీ నేతలంటున్నారు. అది ఎప్పటికి సాధ్యమవుతుందో..?
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              