సీబీఐకి నో ఎంట్రీ కదా- కవిత ఎందుకు ఓకే చెప్పారు!?

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించడానికి ఆరో తేదీన వస్తామని నోటీసులు జారీ చేశారు. ఆమె అందుకు అంగీకరించారు. హైదరాబాద్‌లోని ఇంటికే రావాలని ఆప్షన్ ఇచ్చుకున్నారు వాళ్లు వస్తారు.. ప్రశ్నిస్తారు అది వేరే విషయం. కానీ తెలంగాణలో సీబీఐ దర్యాప్తు చేయడాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. ఏ కేసు విషయంలో అయినా సీబీఐ దర్యాప్తు నేరుగా చేయడం కుదరదు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తే.. వారే దర్యాప్తు చేసి పెడతారు. నిందితులు ఉంటే ప్రశ్నించి పెడతారు.కానీ ఇక్కడ కల్వకుంట్ల కవితనే నేరుగా సీబీఐ రావడానికి అంగీకరించారు.

ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జనరల్ కన్సెంట్‌ను రద్దు చేయడం ద్వారా.. కేంద్ర ఉద్యోగులపైనా సీబీఐ అధికారులు దాడులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. వారు అంగీకరిస్తే చేయాలి లేదంటే లేదు. ఏదైనా అవినీతి సమాచారం ఉంటే.. ఏసీబీనే దాడి చేస్తుంది. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థల సిబ్బందిపై ఏసీబీ దాడులు చేస్తారన్న ప్రచారం జరగడానికి ఇదే కారణం. ఇప్పుడు కవిత జనరల్ కన్సెంట్ రద్దు నిర్ణయాన్ని మర్చిపోయి.. తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీకి అవకాశం కల్పించారు.

లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు హైదరాబాదే సేఫ్ ప్లేస్‌గా కవిత భావిస్తున్నారు. ఢిల్లీలో అయితే ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం బీజేపీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకైనా మంచిదని హైదరాబాద్ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో విచారణ అంటే.. జనరల్ కన్సెంట్ రద్దు అంశం ఆటంకం అవుతుందని వ్యూహాత్మకంగా ఢిల్లీ ఆర్ హైదరాబాద్ అని సీబీఐ చెప్పింది. హైదరాబాద్‌ను కవిత ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు జనరల్ కన్సెంట్ అంశం… అటూ ఇటూ కాకుండా అయిపోయే ప్రమాదం ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close