భారత రాష్ట్ర సమితి అంతర్గ రాజకీయాలు రోడ్డు మీద పడిన తర్వాత కవిత డైరక్ట్ పాలిటిక్స్ చేస్తూంటే.. హరీష్ర్ రావు మాత్రం సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కవిత రోజు రోజుకు హరీష్ పై ఎటాక్ పెంచుతుతున్నారు. ఆమె ఆరోపణల్లో హరీష్ పైనే అత్యధికం ఉంటాయి.తనపై విమర్శలు చేస్తే ఇతరులపైనా చేస్తున్నారు. కానీ కవిత మొదటి టార్గెట్ మాత్రం హరీష్ రావు అని చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. ఈ దాడిని హరీష్ రావు చాలా సైలెంట్ గా ఎదుర్కొంటున్నారు. ఆయన స్పందించడం లేదు. కానీ రీసౌండ్ వచ్చేలా చేస్తున్నారు. దాంతో కవిత.. ఉత్తి పుణ్యాన హరీష్ ను టార్గెట్ చేస్తోందని.. ఆమె రాజకీయం వేరే ఉందని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.
హరీష్ రావుపై ఎప్పుడూ లేని ఆరోపణలు చేస్తున్న కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడానికి కారణం హరీష్ రావు అని కవిత గట్టిగా నమ్ముతున్నారు. ఆయనపై ఆరోపణలు చేసినప్పుడే కవితను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయాల్సిన పరిస్థితిని కవితే తెచ్చుకున్నారు. ఈ ఆరోపణలపై హరీష్ రావు ఒక్క సారి మాత్రమే చాలా పొలైట్ గా స్పందించారు. తర్వాత స్పందించడం మానేశారు. కానీ కవిత మాత్రం ఎప్పుడు .. ఎక్కడ పర్యటించినా హరీష్ రావుపై ప్రత్యక్ష, పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ లో పని చేసి..పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పటికీ కీలక నేతగా ఉంటే.. వారు..హరీష్ వల్లే బయటకు వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.చూస్తున్న అందరికీ ఎక్కడో హరీష్ పై కోపం ఉందని అందకే పగబట్టారని అనుకునేలా ఆ ఆరోపణలు ఉంటున్నాయి.
కవిత రాజకీయాన్ని సైలెంటుగా నిర్వీర్యం చేస్తున్న హరీష్ రావు
కవిత ఆరోపణల్ని హరీష్ రావు పైకి సీరియస్ గా తీసుకోవడం లేదు. అంటే నేమ్ గా స్పందించడం లేదు. తన తరపున పార్టీ నేతలు కూడా మాట్లాడవద్దని .. తనపై ఆరోపణల్ని ఖండించి .. మాటకు మాట వచ్చేలా చేసి.. విషయాన్ని పెద్దది చేయవద్దని సంకేతాలు ఇచ్చారు. అందుకే హరీష్ రావుపై కవిత చేస్తున్న ఆరోపణలకు సొంత పార్టీ నుంచి పెద్దగా ఖండనలు రావడం లేదు. అలాగని హరీష్ రావు వాటిని భరిస్తున్నారా అంటే.. లేనే లేదు. ఆయన కవిత చెప్పేది అంతా అవాస్తవం అన్న సందేశాన్ని సింపుల్ గా ప్రజల్లోకి పంపుతున్నారు. తాను హరీష్ వల్ల బీఆర్ఎస్ పార్టీని వీడానన్న కవిత వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. గతంలోనూ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇతర నేతలు ఖండించారు. హరీష్ కు మద్దతుగా కాకుండా.. కవిత ఆరోపణలు ఖండిస్తూ వారు మాట్లాడారు. హరీష్ పై గతంలో చేసిన అవినీతి ఆరోపణల విషయంలోనూ ఇలాంటి ఖండన వివరాలు థర్డ్ పార్టీ నుంచి మీడియాలో ప్రచారం అయ్యాయి. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ..కోపంతో, ఈర్ష్యతో చేస్తున్నారన్న సందేశం ఇప్పటికే రాజకీయంలోకి వెళ్లిపోయింది.
హరీష్ రావు రాజకీయానికి సింపుల్ గా దొరికేస్తున్న కవిత
కవిత ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తన రాజకీయం చేస్తే తాను సీఎం అయిపోతానని అనుకుంటున్నారు. తాను అందరిపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తానంటున్నారు కానీ తనపై ఎవరూ ఒక్క మాట మాట్లాడకూడదని అనుకుంటున్నారు. కొంత మంది నేరుగా స్పందించినా.. హరీష్ రావు మాత్రం సైలెంట్ గా .. ఆమె ఇమేజ్ ను.. పలుచన చేసి.. ప్రజలు పట్టించుకోని రాజకీయం చేస్తున్నారని అనిపించేలా చేస్తున్నారు. హరీష్ రావు రాజకీయాన్ని అర్థం చేసుకోని కవిత..అలా దూసుకెళ్తూనే ఉన్నారు. జరుగుతున్న డ్యామేజీని గుర్తించడం లేదు.
