కేసీఆర్ లేకపోతే నల్లగొండ లిల్లీపుట్ ఎవరు అని కేసీఆర్ కుమార్తె కవిత… బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కోసం తాను తలపెట్టిన దీక్ష కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించి.. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై మీడియాలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో కవిత స్పందించారు.
నల్లగొండలో పార్టీ ఓటమికి కారణం అయిన లిల్లీపుట్ నాయకుడు తన గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. నల్లగొండలో పార్టీ ఓటమికి ఆయనే కారణం అని.. చివరి క్షణంలో బయటపడ్డారని మండిపడ్డారు. కేసీఆర్ లేకుండా ఆ లిల్లీపుట్ నాయకుడు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. తాను కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేసిందెవరని ప్రశ్నించారు. తనపై తీన్మార్ మల్లన్న ఘోరమైన వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదన్నారు.
కవిత గురించి బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటంలేదు.. ఒక్క జగదీష్ రెడ్డి మాత్రమే అడ్వాంటేజ్ తీసుకున్నారు. కవిత కేవలం ఎమ్మెల్సీ మాత్రమేనని ఆమెను తమ పార్టీ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే ఆమె వార్డుమెంబర్ గా కూడా గెలవరన్నట్లుగా మాట్లాడుతున్నారు. జగదీష్ రెడ్డి కవిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పార్టీ అనుమతితో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే కవిత మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
గతంలో మీడియాను జగదీష్ రెడ్డి బెదిరించినప్పుడు.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కూడా జగదీష్ రెడ్డిని పరోక్షంగా మరుగుజ్జు నేత అని విమర్శించారు. ఇప్పుడు కవిత కూడా అలాగే మాట్లాడటంతో ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.