రేవంత్‌రెడ్డి విమర్శలపై స్పందించిన కవిత

హైదరాబాద్: తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలమీద నిజామాబాద్ ఎంపీ కవిత ఇవాళ స్పందించారు. కమిషన్లకోసమే ప్రాజెక్టులు కడుతున్నారని అనటం అవివేకమన్నారు. కమిషన్ల రాజ్యానికి తెరతీసిందే చంద్రబాబునాయుడని ఆరోపించారు. పచ్చగా ఉన్న నిజామాబాద్ జిల్లాను కరవుకోరల్లోకి  నెట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. 60 ఏళ్ళ ఆంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ తెలంగాణ నేతలు చంద్రబాబుకు మద్దతిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి గంటికొట్టేవిధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు బంద్ నిర్వహించి తమ వైఖరి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంకింద 40లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. కేసీఆర్‌లో ఎవరి ఆత్మా ఆవహించి ఉండదని, కేవలం తెలంగాణ ఆత్మమాత్రమే ఆవహించి ఉంటుందంటూ, కేవీపీ కేసీఆర్ ఆత్మగా మారాడని నిన్న రేవంత్ చేసిన విమర్శను పరోక్షంగా ప్రస్తావిస్తూ కవిత వివరణ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com