తెలంగాణను సిలికాన్ వ్యాలీగా మారుస్తాం – కవిత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్‌గా… స్టార్టప్ స్టేట్‌గా అభివృద్ధి చేయటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 16 మాసాల్లోనే టీఎస్ఐపాస్, టీహబ్‌ల ఏర్పాటు, పారిశ్రామికీకరణ, ఐటీ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతే దీనికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో నిర్వహించిన ది ఏంజల్ సమ్మిట్‌లో పాల్గొన్న కవిత ‘ది లాంగ్ రోడ్ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రు.25 వేల కోట్ల పెట్టుబడులతో 1013 కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ఆర్థికరంగ సంస్థలను ఒకేచోట కలుపుతూ ఏంజల్ సమ్మిట్ నిర్వహించటం అభినందనీయమన్నారు.

మహిళలు స్టార్టప్ రంగంలో అంతగా ఆసక్తి చూపించటంలేదని, పేపర్ నుంచి బీఎండబ్ల్యూ కారువరకు అమ్మగలిగే సామర్థ్యం గలవారు స్టార్టప్ రంగంలో సైతం ప్రవేశించాలని పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లో 21శాతం మహిళా స్టార్టప్‌లో ఉండటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చిన్నప్పటినుంచి నాన్న కేసీఆర్ తనకు పూర్తి స్వేఛ్ఛనిచ్చి పెంచారని కవిత చెప్పారు. చదువుకునే రోజుల్లో టీవీలు, ట్యూషన్‌లు, ఐపాడ్‌లు లేవని, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి ఇష్టం వచ్చిన చోటల్లా ఆడుకునేవాళ్ళమంటూ గత స్మృతులను నెమరువేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close