అమెరికా పర్యటన నుంచి వచ్చిన కల్వకుంట్ల కవిత సోమవారం కాళేశ్వరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సరస్వతి పుష్కరాల్లో పూజలు చేయనున్నారు. అయితే తను రాసిన లేఖ లీక్ అయిన అంశంపై కేసీఆర్ తో చర్చించేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ను కలుస్తారని తన లేఖ లీక్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ నే కాదు.. బీఆర్ఎస్ నేతల్ని ఎవర్నీ కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
మరో వైపు ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ కీలక నేతలు క్యూ కడుతున్నారు. వరుసగా రెండు రోజుల పాటు హరీష్ రావు కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఆదివారం కేటీఆర్.. ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ చర్చల ఎజెండా .. కవిత ఇష్యూనేనని చెప్పాల్సిన పని లేదు. కవిత ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో వారికి క్లారిటీ ఉంది. కవిత సొంత పార్టీ వ్యూహాల్లో ఉన్నారని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఎలాంటి వ్యూహం పాటించాలన్న దానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ అయిన కుమార్తె కవితతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ కూడా ఆ దిశగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. కారణం ఏమైనా కానీ.. కవిత ఇప్పుడు సోదరుడితో పాటు కేసీఆర్ కూ దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కవితపై చర్యలు అనే లీకులు వచ్చాయని అంటున్నారు.