ఎమ్మెల్సీలు గెలవకపోతే ఎమ్మెల్యే టిక్కెట్లు లేనట్లే..!

తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో గెలవడం టీఆర్ఎస్‌కు అత్యంత కీలకం. అందుకే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా భారం ఎమ్మెల్యేలపై వేశారు. కేటీఆర్‌కు టాస్క్ అప్పగించారు. కేటీఆర్ ఎమ్మెల్యేలను తరుముతున్నారు. గెలిపించుకుని రాకపోతే… మీకు కష్టమేనని నేరుగా చెబుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగారు. అక్కడ అభ్యర్థి పల్లా రాజశ్వేర్ రెడ్డి జోరుగానే ఉన్నారు. ఓటర్లను కలుస్తున్నారు. కానీ సమస్య అంతా రంగారెడ్డి పట్టభద్రుల నియోజవకవర్గంలోనే వస్తోంది. అక్కడ చివరి క్షణంలో పీవీ కుమార్తెను కేసీఆర్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆమెకు హైకమాండ్ ఎలాంటి ఆఫర్ ఇచ్చిందో కానీ.. ఆమె ప్రచారానికి రారని. .. ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ నేరుగానే లక్ష్యం నిర్దేశిస్తున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నేతలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక్కో జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. వాణి దేవి బయట తిరిగి ప్రచారం చేయలేరని అందుకే ప్రచార బాధ్యత మొత్తం ఎమ్మెల్యేలే తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో సరైన ఫలితాలు తీసుకు రాని సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, ముఠాగోపాల్ లపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో చేసినట్లుగా చేస్తే ఈ సారి టిక్కెట్లు ఉండవని పరోక్ష సంకేతాలు పంపేశారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్ లో కొంత నైరాశ్యం నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడ చేదు అనుభావాలే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో గెలిచితీరాలన్నఅనివార్యత టీఆర్ఎస్ కు ఏర్పడింది. దాంతో చాలెంజ్ గా తీసుకుని గెలిపించాల్సిన భారాన్ని నేతలందరికీ అప్పగించింది. అయితే అభ్యర్థి కూడా ప్రచారానికి రాకుండా ఎలా గెలిపించుకు రావాలన్నది ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఒక వేళ పీవీ కుమార్తె ఓడిపోతే రెండు రకాలుగా నష్టం జరుగుతుంది. పీవీని అవమానించారన్న విమర్శలు పెరుగుతాయి. అందుకే కేటీఆర్ … ఎమ్మెల్యేలపై భారం వేయడమే కాదు..తాను స్వయంగా రంగంలోకి దిగుతానంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close