దటీజ్ కేసీఆర్.. ! కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. ఐదు కోట్లు..!

విపక్షాల నుంచి దూసుకు వచ్చే విమర్శలకు.. కేసీఆర్ ఇచ్చే కౌంటర్లు మైండ్ బ్లాకయ్యేలా ఉంటాయి. చైనా దుశ్చర్యలకు బలైపోయిన కల్నల్ సంతోష్ బాబుకు… కేసీఆర్ కనీసం నివాళి కూడా అర్పించలేదని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హరికృష్ణ చనిపోతే వెళ్లారు.. పరిటాల ఫ్యామిలీ పెళ్లికి వెళ్లారు.. అంటూ.. కేసీఆర్ వెళ్లిన రకారకాల ఈవెంట్లను గుర్తు చేస్తూ …దేశం కోసం ప్రాణాలు వదిలిన సంతోష్ బాబుకు మాత్రం నివాళి అర్పించడానికి తీరిక లేదా.. అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది అంతకంతకూ పెరిగిపోతూండటంతో.. పులిస్టాప్ పెట్టే నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటించారు.

ఇప్పుడు.. అందరూ.. కేసీఆర్ నివాళి అర్పించడానికి వెళ్లారా లేదా.. అన్నదాన్ని గురించి చర్చించరు.. కేసీఆర్ ప్రకటించిన సాయం గురించే చర్చించుకుంటారు. సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సర్కార్ తరపున ఏకంగా రూ. ఐదు కోట్ల సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. అలాగే.. ఆ ఘటనలో మరణించిన మరో 10 మంది సైనికులకు తలా పది లక్షల సాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు.. ఆయన భార్యకు.. గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.

అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శించలేదని వస్తున్న విమర్శలకు కూడా.. దీంతోనే చెక్ పెట్టబోతున్నారు. ఐదు కోట్ల సాయాన్ని తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి అందిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్… తనపై వచ్చే విమర్శలు చాలా పీక్ స్టేజ్ కి వెళ్లిన తర్వాత ఒక్క సారిగా.. సడెన్‌గా అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుని.. అందరి నోళ్లూ ఒకే సారి మూయిస్తారు.. ఇంకా చెప్పాలంటే.. వారితోనే పొగడ్తలు అందుకుంటారు. సంతోష్ బాబు విషయంలోనూ అదే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close