మోడీని వరద సాయం అడిగిన కేసీఆర్..! మరి ఏపీ సీఎం..?

తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. నగరాలను ముంచెత్తిన నీరు ఒక రోజుకో..రెండురోజులకో తగ్గిపోతుంది. కానీ పొలాల్లోకివచ్చిన నీరు పంటను కూడా తీసుకెళ్లిపోతుంది. రైతులు అన్యాయమైపోతారు. ప్రభుత్వాలు వెంటనే వారిని ఆదుకోవాల్సి ఉంది. కానీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. భారీ వర్షాలు…తీవ్ర నష్టం చేసినట్లుగా తెలియడంతో.. ప్రధాని మోదీ.. జగన్,కేసీఆర్‌లకు కాల్ చేశారు. వివరాలు అడిగారు. వెంటనే… ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మందికిపైగా మృతి చెందారని. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల డ్యామేజీ, విద్యుత్‌శాఖకు తీరని నష్టం జరిగిందని తేల్చారు.

సమీక్ష ముగిసిన వెంటనే కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని .. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం.. కేంద్రాన్ని రూ.1,350 కోట్లు ఇవ్వాలని లేఖలో కోరారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. కానీ వరదలైప కాదు..వరద నష్టంపై కాదు. వరదల వల్ల నష్ట పోయిన రైతుల్ని ఆదుకోవడానికి కాదు. మున్సిపాల్టీల్లో చేయాల్సిన సంస్కరణల గురించి సమీక్ష చేశారు. అక్రమ లేఔట్లను గుర్తించి రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. మరి రైతుల గురించి ఎవరు పట్టించుకుంటారు..? తెలంగాణలో 9 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే..ఏపీలో ఆ నష్టం 20 లక్షల ఎకరాల వరకూ ఉంటుందని అంచనా వేశారు.

కానీ ప్రభుత్వ పెద్ద మాత్రం ఈ విషయంలో నింపాదిగా ఉన్నారు. ప్రధాని ఫోన్ చేసినా.. ఏపీలో అంతా సాధారణ పరిస్థితే ఉందని తేల్చి చెప్పేసినట్లుగా మీడియాకు చెప్పారు. అంటే… ఏపీలో వరదను ఏపీ సర్కార్ లైట్ తీసుకందన్నమాట. అయితే… రైతులంతా సంతోషంగా ఉన్నారనే ప్రకటనలు మాత్రం ఒకటి,రెండు రోజుల్లో జోరుగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానే ఆరా తీశారంటే… కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం పొందడానికి ప్రయత్నాలు చేస్తారు ముఖ్యమంత్రులు.. కేసీఆర్ అదే చేశారు..కానీ జగన్ మాత్రం.. లైట్ తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close