కేంద్రంలో సంకీర్ణం వస్తుందని చెబితే బీఆర్ఎస్‌కు ఓట్లేస్తారా ?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోజుకు నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయన స్పీచ్‌లు మొత్తం ఒకటే రకంగా ఉంటున్నాయి. మార్పులేమీ ఉండటం లేదు. ఆయన స్పీచుల విషయంలో గతంలోనే ఓ బెంచ్ మార్క్ సృష్టించారు. ఇప్పుడు దాన్ని అందుకోలేకపోతూండటంతో చప్పగా సాగుతున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే గత రెండు రోజులుగా పంధా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, మోదీపై విమర్శలు చేస్తున్నారు. కానీ హైలెట్ కావడం లేదు. కానీ ఓ ప్రకటన విషయంలో మాత్రం.. అసెంబ్లీ ఎన్నికలతో ఎందుకు ముడిపెడుతున్నారన్న సందేహం అందరికీ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి పూర్తి మెజార్టీ రాదని చెబుతున్నారు.

సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని… ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని కేసీఆర్ అంటున్నారు. అంటే కేసీఆర్ తన పార్టీ చక్రం తిప్పుతుందని అనుకుంటున్నారేమో స్పష్టత లేదు.. తనది జాతీయ పార్టీ అని కేసీార్ ఇప్పటికే ప్రకటించారు. తన పార్టీని ఇంకా టీఆర్ఎస్ గా నమ్మించేందుకు ఇలాంటి ప్రకటనల చేస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. అయితే కేంద్రంలో సంకీర్ణం వస్తే రావొచ్చు.. .. మోదీ ఎన్నికల్లో గెలవకపోతే పోవచ్చు..కానీ.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు చెప్పడం ద్వారా కేసీఆర్ ఏం ఆశిస్తున్నారన్నది సస్పెన్స్ గానే ఉంది. జాతీయ రాజకీయ ప్రస్తావన ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో రావట్లేదు.

కేసీఆర్ ను మూడో సారి కొనసాగించాలా వద్దా.. కొనసాగించకపోతే ప్రత్యామ్నాయం ఎవరు అన్న దిశగానే ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాలను తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మాటలను ప్రొ టీడీపీ మీడియా ఎంతగా ప్రచారం చేస్తున్నా… పెద్దగా హైలెట్ కావడం లేదు. ఎన్నికల ఎజెండా మార్చే టైం కూడా అయిపోయిందన్నట్లుగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

యానిమ‌ల్ మిషన్ గ‌న్ @ రూ.50 ల‌క్ష‌లు

ఈమ‌ధ్య యాక్ష‌న్ సినిమాల్లో పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు శ‌త్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్ర‌మ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు...
video

క‌థంతా దాచేసి.. ట్రైల‌ర్ క‌ట్ చేశారు!

https://www.youtube.com/watch?v=GnO4cOx_wFQ నితిన్ - వ‌క్కంతం వంశీ సినిమా `ఎక్ట్రా ఆర్డిన‌రీ మెన్‌` ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close