మునుగోడును చక్క బెడుతున్న కేసీఆర్ !

మునుగోడు ఉపఎన్నికలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా చక్కబెడుతున్నారు. హుజూరాబాద్‌లో జరిగిన తప్పులు ఇక్కడ జరకుండా చూసుకుంటున్నారు. ఈ సారి అక్కడి బాధ్యతను హరీష్‌కు పూర్తి స్థాయిలో అప్పగించడంలేదు. మంత్రి జగదీష్ రెడ్డే ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. కానీ కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు . మండలాల వారీగా ఇంచార్జుల్ని నియమిస్తున్నారు. అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేశారు. అయితే ఆయనపై తీవ్ర అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది.

ఆర్థిక పరంగా.. సర్వేల్లోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే సానుకూలత వస్తోందని భావిస్తున్న హైకమాండ్.. అసంతృప్తిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారు మంత్రి జగదీష్ రెడ్డి మాటలు వినడం లేదు. దీంతో నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కొంత మంది నేతల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. కూసుకుంట్లకే మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇక పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వే సమాచారం తెప్పించుకుని.. ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో ప్రణళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో కేసీఆర్ ఒక ఎన్నిక మీద ఇలా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం ఇదే మొదటి సారి అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దుబ్బాకలో అతి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ ఒక్క రోజు సమయం కేటాయించినా పరిస్థితి వేరుగా ఉండేదనుకున్నారు. హుజురాబాద్‌లోనూ అంతే. పూర్తిగా హరీష్‌కు బాధ్యతలిచ్చారు. హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించారు కానీ హుజూరాబాద్ వైపు వెళ్లలేదు. ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. దీంతో పార్టీ వర్గాల్లోనూ విశ్వాసం పెరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెదనాన్న మన గుండెల్లో వున్నారు : ప్రభాస్

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్‌ ఇక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన...

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close