మహారాష్ట్రలో కేసీఆర్ డేరింగ్ స్టెప్ !

భారత్ రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి కేసీఆర్ వ్యూహాత్మకం వేసిన ముందడుగు నాందేడ్ సభ అనుకోవచ్చు. మొదట ఆయన ఢిల్లీలో లేకపోతే యూపీలో బహిరంగసభ పెడతారన్న ప్రచారం జరిగింది. కానీ తన రాజకీయ పార్టీ తాను ఆకాశానికి గాలం వేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నా చేతల్లో మాత్రం మొత్తం నేల మీద ఉండే.. . నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా నాందేడ్ సభను బట్టి అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ సభ పెట్టిన ప్రాంతం .. ఒకపట్టి హైదరాబాద్ స్టేట్‌లో కలిసి ఉండేది. అక్కడి ప్రజల్లో మనది తెలంగాణ ప్రాంతం అనే భావన ఉంటుంది . దీన్ని కేసీఆర్ రాజకీయంగా మరింత పైకి తీసుకు వచ్చేందుకు ఉపయోగించుకున్నారు.

నాందెడ్ సభలో కేసీఆర్ ఎక్కువగా తెలంగాణ గురించే చెప్పారు. లోకల్ సమస్యలను ప్రస్తావించారు. మనం మనం ఒకటి అనే భావన కల్పించడానికి ప్రయత్నించారు. ఇంతకు ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో .. మనం తెలంగాణలో కలవాలి అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మహారాష్ట్ర శివారు ప్రాంతం కావడం.. అక్కడి ప్రభుత్వం నగదు బదిలీ సంక్షేమ పథకాలు తెలంగాణ స్థాయిలో లేకపోవడంతో అక్కడి ప్రజలు సహజంకానే ఆకర్షితులవుతారు. అందుకే తెలంగాణలో కలిస్తే బాగుండనే అభిప్రాయం పెంచుకుంటున్నారు. ఇది కేసీఆర్ వ్యూహం వల్లనే సాధ్యమయింది. అయితే ఈ డిమాండ్ పెరిగితే అది రాజకీయ సమస్యగా మారుతుంది. కానీ బీఆర్ఎస్‌కు ఓటు వేసేలా మార్చుకోగలిగితే రాజకీయ బలం అవుతుంది. దీని కోసం కేసీఆర్ కార్యచరణ ప్రారంభించారు. ఆయన .. ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని అడగడం లేదు. బీఆర్ఎస్ పాలనే … మహారాష్ట్రలో వస్తుంది ఓటు వేయమని అడుగుతున్నారు. ఇది వ్యూహాత్మకం.

కేసీఆర్ నాందేడ్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇతర పార్టీల నేతల్ని చేర్చకున్నారు. భారీ నేతలు ఎవరూ చేరకపోవచ్చు. గ్రామాల్లో కాస్త పట్టు ఉన్న వాళ్లు చేరారు. అదే ధైర్యంతో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు . ఓ రకంగా కేసీఆర్ కు ఇది మొదటి విజయం అనుకోవచ్చు. ముందుగా కేసీఆర్.. తన పార్టీ బలపడాలనుకుంటున్న హైదరాబాద్ స్టేట్ పాలనలో ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారని అర్థం చేసుకోవచ్చు. అయితే మహారాష్ట్రరాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాయన్నది సందేహమే. అక్కడ మరాఠా సెంటిమెంట్ ఎక్కువగానే ఉంటుంది.. కేసీఆర్ ఇప్పటికైతే డేరింగ్ స్టెప్ వేశారు. అక్కడి నేతలు ఎంత చురుకుగా ఉంటారన్న దానిపై బీఆర్ఎస్ బలపడటం ఆధారపడి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముఖ ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close