దళిత బంధుపై సైలెంట్.. రైతు బంధు మాత్రం వచ్చే నెలే..!

తెలంగాణలో ఇప్పుడు దళిత బంధు గురించి ఎక్కడా చర్చించడం లేదు. అమలు కూడా ఆగిపోయింది. హుజురాబాద్‌లో వంద శాతం అమలు చేస్తామన్నారు కానీ ఇప్పుడు అక్కడ కూడా ప్రాసెస్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. కానీ రైతు బంధును మాత్రం కాస్త ముందుగానే రైతుల ఖాతాల్లో వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కసరత్తు ప్రారంభించింది.

తెలంగాణలో యాసంగి సీజన్పంటలు వేయడాన్ని రైతులు ప్రారంభించారు. వరిని రైతులు అతి తక్కువగా వేస్తున్నారు. ముందుగానే రైతు బంధు సాయం చేస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల నిధులను పంపిణీ చేయనున్నారు. ఆర్థిక వనరులను కూడా సమీకరించుకున్నారు. ప్రతి ఏటా రెండు సార్లు రైతు బంధు ఇస్తున్నారు. గత జూన్‌ నెలలో ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఇప్పుడు సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు పంపిణీ చేయనున్నారు. నిధులను సర్దుబాటు చేసుకుని.. డిసెంబరు మొదటి వారంలో రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ఉంటుంది. ఈ సారి ఈ పథకాన్ని సాదాసీదాగా నిర్వహించాలా లేక సభలు..సమావేశాలు పెట్టాలా అన్నదానిపై స్పష్టత లేదు. కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధులు దీనికి సంబంధంలేదు. ఏపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కేంద్ర నిధులు కలిపి చెబుతోంది కానీ తెలంగాణ సర్కార్ మాత్రం వాటిని కేంద్ర పథకంగానే ఉంచేసింది. తాము సొంతంగా అమలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close