హరీష్‌రావు విధేయత చూపించడంలో తడబడుతున్నారా..?

టీఆర్ఎస్‌లో నిన్నామొన్నటి వరకూ పవర్ ఫుల్ లీడర్‌గా ఉన్న హరీష్‌రావు.. ఇప్పుడు.. తన మామకు.. తన విధేయత చూపించడంలో తడబడుతున్నారు. కేటీఆర్‌ను స్మూత్‌గా రాజకీయ వారసుడిగా ప్రకటించుకోవడానికి..కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు అడ్డుగా.. ఒక్క హరీష్‌రావే కనిపిస్తున్నారు. పార్టీలో హరీష్‌రావుకు.. బయటకు కనిపించనంత పట్టు ఉందన్న క్లారిటీ కేసీఆర్‌కు ఉంది. అందుకే ప్లాన్డ్‌గా… హరీష్‌ను పూర్తిగా దూరం పెట్టి.. కేటీఆర్‌ పలుకుబడి పెంచేలా చేశారు. కానీ అదంతా…. కేసీఆర్ ప్రొత్సహం వల్లే వచ్చింది. ఒక్కసారిగా.. తేడా వస్తే.. పార్టీ నేతలంతా… హరీష్‌ వైపు వెళ్లిపోతారన్న భయం… కేసీఆర్‌కు ఉంది. అందుకే.. హరీష్ రావుపై నిఘా పెట్టడం దగ్గర్నుంచి.. ఆయనకు అంతో.. ఇంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న నేతలెవర్నీ…దగ్గరకు రానీయడం లేదు.

ఈ పరిస్థితి హరీష్ రావుకు కూడా తెలిసి వచ్చింది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినా తనకేమీ ఇబ్బంది లేదని.. మాటలు చేతల్లో చూపించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గత వారం రోజుల్లో ప్రముఖ మీడియా మొత్తానికి ఇంటర్యూలు ఇచ్చారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా.. ఆయన నాయకత్వంలో పని చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని… స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇలా ఎన్ని మాటలు చెప్పినా..కేసీఆర్‌కు మాత్రం నమ్మకం కుదరలేదు. ప్రగతి భవన్ నుంచి హరీష్‌కు పిలుపు రాలేదు. ఫామ్‌హౌస్‌లో కలుద్దామన్నా చాన్స్ దొరకడం లేదట. పరిస్థితి మరీ తేడాగా ఉందని గుర్తించారేమో కానీ.. వెంటనే… సిద్ధిపేట ప్రచారంలో… ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటానని.. ఆఫర్ ఇచ్చేశారు. ఇది మరింత రచ్చ అయిపోయింది. దీంతో… వెంటనే.. భావోద్వేగంతో అన్న మాటలేనని.. హరీష్‌ కవర్ చేసుకున్నారు.

కానీ హరీష్ రావు వ్యవహారం.. టీఆర్ఎస్‌లోని అంతర్గత పరిస్థితుల్ని బయట పెడుతున్నాయన్న అంచనాలు మాత్రం జోరుగానే వినిపిస్తున్నాయి. హరీష్‌ ..ఏదో ప్లాన్‌లో ఉన్నారన్న పక్కా సమాచారం లేకపోతే.. కేసీఆర్… ఇంత ఆందోళన చెందరన్న అభిప్రాయం కూడా.. ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేనిది హరీష్.. రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించడం అంటే.. కేటీఆర్‌ కు అడ్డం లేకుండా వెళ్తానని చెప్పడమా.. ? లేక.. తనకు ఎలాంటి తిరుగుబాటు ఆలోచనలు లేవని..మామకు సందేశం పంపడానికా..? అన్న.. సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. ఈ వ్యవహారంలో వచ్చే కొద్ది రోజుల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలైతే ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎలాంటి పరిణామాలనేది ఊహించడం కష్టమే…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close