ఫామ్‌హౌస్ కేసీఆర్‌ది కాదు – అఫిడవిట్ నిజాలు ఇవే !

ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ రెండు, మూడు వందల ఎకరాలు ఉంటుందని అటు వైపు వెళ్లిన వాళ్లు చెబుతూ ఉంటారు. అది ఎన్ని ఎకరాలైనా ఉండవచ్చు కనీ.. అది కేసీఆర్ ది కాదు. ఈ విషయాన్ని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. నామినేషన్ సందర్భంగా ఆస్తులపై డిక్లరేషన్ ఇచ్చారు. అందులో తన పేరిట ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారు. మరి ఆ ఫామ్ హౌస్ సంగతేమిటంటే.. అది మొత్తం కుటుంబం పేరును చూపారు.

కుటుంబానికి ఉమ్మడిగా 62 ఎకరాలు ఉండగా, ఇందులో 53.30 ఎకరాలు సాగుభూమి కాగా, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపారు. హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందినట్లుగా ఆస్తులను కేసీఆర్ డిక్లేర్ చేశారు. అందుకే తన పేరుపై భూములు లేకుండా పోయాయి. అయితే తన స్థిరాస్తులు మొత్తం రూ. 58.17 కోట్లు ఉంటాయన్నారు. నగదు, డిపాజిట్లు, టీ-న్యూస్‌లో పెట్టుబడులు వంటి చరాస్తులు రూ. 35.42 కోట్లు ఉంటాయని చూపించారు. అప్పు కూడా భారీగానే ఉంది. కేసీఆర్‌కు వ్యక్తిగతంగా రూ. 17.12 కోట్లు అప్పు ఉందన్నారు. కుటుంబానికి సంబంధించి రూ. 7.23 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు. కార్లు లాంటివేమీ లేవు కానీ.. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీల్లాంటి 14 వాహనాలు ఉన్నాయని చెప్పారు.

2018లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రకటించిన అఫిడవిట్‌కు ఇప్పటి అఫిడవిట్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో చరాస్తుల విలువను రూ. 10.40 కోట్లు . స్థిరాస్తులును రూ. 12.20 కోట్లుగా చూపించారు. ఎర్రవెల్లి గ్రామంలోని 54 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుపైనే ఉన్నట్లుగా చూపించారు. ఈ సారి అఫిడవిట్ ను పూర్తిగా మార్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close